Home » అచ్చం రాజశేఖర్ లానే ఉన్న ఈ హీరో ఎవరో ఎవరో తెలుసా..? ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటంటే…?

అచ్చం రాజశేఖర్ లానే ఉన్న ఈ హీరో ఎవరో ఎవరో తెలుసా..? ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటంటే…?

by AJAY
Published: Last Updated on
Ad

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా రాణించిన వారిలో రాజశేఖర్ కూడా ఒకరు. వృత్తిరిత్యా డాక్టర్ అయిన రాజశేఖర్ సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వరుస ఆఫర్లు రావడంతో స్టార్ హీరోగా ఎదిగాడు. అంతేకాకుండా రాజశేఖర్ తనతో కలిసి సినిమాలు చేసిన హీరోయిన్ జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం ఇద్దరూ కూడా టాలీవుడ్ లో హీరోయిన్ లుగా రాణిస్తున్నారు.

hero-rajashekar-brother

hero-rajashekar-brother

 

అంతేకాకుండా రాజశేఖర్ కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. రాజశేఖర్ తెలుగులో ప్రతిఘటన, ఆహుతి, తలంబ్రాలు, రేపటి పౌరులు, ఆరాధన, అంకుశం, అల్లరి ప్రియుడు, ఆవేశం, ఎవడైతే నాకేంటి, గరుడవేగ లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇదిలా ఉంటే రాజశేఖర్ తమ్ముడు కూడా హీరో అన్న సంగతి చాలా మందికి తెలియదు. రాజశేఖర్ తమ్ముడి పేరు సెల్వా ఈయన 1991 నుండి తమిళ సినిమాలలో నటిస్తున్నాడు.

Advertisement

Advertisement

సెల్వ దర్శకుడిగా రచయితగా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. 1994లో సుబ్బిరామిరెడ్డి నిర్మాణంలో బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ మాస్టర్ సినిమాలో రాజశేఖర్ నగ్మా హీరో హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాలో రాజశేఖర్ తమ్ముడు సెల్వ కూడా నటించాడు. అయితే గ్యాంగ్ మాస్టర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత హిందీలో వచ్చిన గోల్మాల్ సినిమాను తమిళంలో నిర్మించాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

ఇక 1991లో బాల దర్శకత్వంలో సేతు అనే సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో మొదట సెల్వను హీరోగా తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సెల్వ తప్పుకున్నాడు. దాంతో ఆయన స్థానంలో విక్రమ్ హీరోగా నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దాంతో సెల్వ సూపర్ హిట్ ను మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత సెల్వ రాజశేఖర్ హీరోగా నటించిన కొన్ని సినిమాలకు కథ రచయితగా కూడా పనిచేశాడు. ప్రస్తుతం సెల్వ తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోవడానికి లావణ్య త్రిపాఠికి మెగా ఫ్యామిలీ పెట్టిన కండిషన్స్ ఏమిటంటే..?

జయలలిత కోసం శోభన్ బాబు ఎన్ని త్యాగాలు చేశారో తెలుసా..!

అకస్మాత్తుగా మారుతున్న వాతావరణంతో ఎదుర్కొనే సమస్యలు ..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..?

Visitors Are Also Reading