Home » Nikhil Siddhartha : త్వరలో తండ్రి కాబోతున్న హీరో నిఖిల్…!

Nikhil Siddhartha : త్వరలో తండ్రి కాబోతున్న హీరో నిఖిల్…!

by Bunty
Ad

 

హీరో నిఖిల్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాలో నిఖిల్ సెకండ్ హీరోగా పరిచయమయ్యారు. ఆ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ వరుసగా సినిమా అవకాశాలను అందుకున్నాడు. కానీ ఏ సినిమాలోనో పెద్దగా ఇతనికి గుర్తింపురాలేదు. ఆ తర్వాత హీరో నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది ‘కార్తికేయ 2’. ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది.

Hero nikhil siddartha expecting his first child

పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా క్రేజ్ సంపాదించుకుంది. ఇక నిఖిల్ వ్యక్తిగత విషయానికి వస్తే, 2020 సంవత్సరంలో డాక్టర్ పల్లవి వర్మ అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. నిఖిల్ సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు. తనకు, తన కుటుంబానికి సంబంధించిన విషయాలను చాలా తక్కువగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నిఖిల్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Advertisement

Hero nikhil siddartha expecting his first child

దీపావళి సందర్భంగా ఓ ఫంక్షన్ కి నిఖిల్ తన భార్యతో కలిసి అటెండ్ అయ్యారు. ఆ ఫంక్షన్ లో పల్లవి బేబీ బంప్ తో కనిపించింది. పల్లవి ప్రెగ్నెంట్ అని, వీరిద్దరూ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ జంటకి అభిమానులంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నిఖిల్ తాజాగా ‘స్వయంభు’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో సాగే కథాంశంగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా హిట్ అవ్వాలని నిఖిల్ అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading