Home » సిల్క్ స్మిత చ‌నిపోయిన‌ప్పుడు ఇండ‌స్ట్రీ నుండి వెళ్లిన‌ ఒకే ఒక్క హీరో ఎవ‌రో తెలుసా..? ఆయ‌న కూడా ఎందుకు వెళ్లారంటే.?

సిల్క్ స్మిత చ‌నిపోయిన‌ప్పుడు ఇండ‌స్ట్రీ నుండి వెళ్లిన‌ ఒకే ఒక్క హీరో ఎవ‌రో తెలుసా..? ఆయ‌న కూడా ఎందుకు వెళ్లారంటే.?

by AJAY
Ad

మేక‌ప్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి ఆ త‌ర‌వాత స్టార్ గా ఎదిగిన అందాల‌తార సిల్క్ స్మిత. మ‌త్తు క‌ళ్ల‌తో త‌న‌దైన అందంతో సిల్క్ అభిమానుల‌ను సంపాదించుకుంది. సిల్క్ స్మిత జీవితంలో సినిమాకు మించిన ట్విస్ట్ లు ఉంటాయి. పేద కుటుంబంలో జ‌న్మించిన సిల్క్ కు చిన్న వ‌య‌సులోనే త‌ల్లిదండ్రులు పెళ్లి చేసి పంపించారు. కానీ భ‌ర్త వేధింపులు త‌ట్టుకోలేక సిల్క్ స్మిత త‌న పిన్నిగారి ఇంటికి వెళ్లింది.

Advertisement

ఇక త‌న పిన్ని తో క‌లిసి ఆ త‌ర‌వాత మ‌ద్రాస్ లో అడుగుపెట్టింది. అలా వెళ్లిన సిల్క్ మొద‌ట మేక‌ప్ ఆర్టిస్ట్ గా త‌న కెరీర్ ను ప్రారంభించింది. కాగా ఓ ద‌ర్శ‌కుడి భార్య కంట ప‌డ‌టంతో సినిమా ఆవ‌కాశాల‌ను అందుకుంది. సినిమాల్లో కూడా మొద‌ట సైడ్ డ్యాన్సర్ గా మొద‌లు పెట్టి ఆ త‌ర‌వాత ఐట‌మ్ గ‌ర్స్ గా ఎదిగింది.

Advertisement

సినిమాల‌లో ఐట‌మ్ సాంగ్స్ చేయాలంటే అప్ప‌ట్లో సిల్క్ కావాల్సిందే. సిల్క్ స్మిత డేట్స్ కోస‌మే స్టార్ హీరోలు సైతం ఎదురుచూసేవారు. అలాంటి సిల్క్ స్మిత ఇండ‌స్ట్రీకి చెందిన ఓ హీరోను ప్రేమించి మోసపోయింది. అంతే కాకుండా ఆ బ్రేక‌ప్ కార‌ణంగా మ‌ద్యానికి బానిస‌య్యింది. అదే విధంగా సినిమాలు నిర్మించి కూడా న‌ష్టాల‌పాల‌య్యింది.

చివ‌ర‌కు సిల్క్ త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌* కూడా చేసుకుంది. అయితే సిల్క్ కు ల‌క్ష‌ల్లో అభిమానులు ఉన్న ఒక‌ప్పుడు ఆమె ఇండ‌స్ట్రీలో రానించిన‌ప్ప‌టికీ చ‌నిపోతే మాత్రం చిత్ర‌ప‌రిశ్ర‌మ నుండి ఎవ్వ‌రూ రాలేదు. కానీ హీరో అర్జున్ ఒక్క‌రే వెళ్లారు. అక్క‌డ మీడియా మిత్రులు అర్జున్ తో…సినిమా ఇండ‌స్ట్రీ నుండి ఇక్క‌డ‌కు ఎవ్వ‌రూ రాక‌పోయినా మీరు మాత్రం ఎందుకు వ‌చ్చారు అని ప్ర‌శ్నించారు. దాంతో సిల్క్ తో తాను ఓ సినిమాలో న‌టించానని అప్పుడు సిల్క్ నేను చ‌నిపోతే క‌నీసం నువ్వైనా వ‌స్తావా అంటూ ప్ర‌శ్నించింద‌ని ఏడుస్తూ స‌మాధానం ఇచ్చారు.

ALSO READ :మొగ‌లిరేకులు సీరియ‌ల్ హీరోయిన్ మేధా గుర్తుందా…ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

Visitors Are Also Reading