Telugu News » Blog » విఘ్నేష్ ఈ స్థాయిలో ఉండటానికి నయనతార మాజీ ప్రియుడే కారణమా…?

విఘ్నేష్ ఈ స్థాయిలో ఉండటానికి నయనతార మాజీ ప్రియుడే కారణమా…?

by AJAY
Ads

గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న హీరోయిన్ నయనతార దర్శకుడు విగ్నేష్ ల వివాహం మొన్న మహాబలిపురం లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఏడేళ్ల క్రితం నయనతార హీరోయిన్ గా నటించిన ఓ  సినిమాకు విఘ్నేష్ దర్శకత్వం వహించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.

Ads

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే చాలా మంది సెలబ్రిటీలు ప్రేమలో పడటం విడిపోవడం కామన్…కానీ నయనతార విఘ్నేష్ ఏడేళ్ల ప్రేమాయణం తరవాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అందరి లానే ఈ జంట కూడా పెళ్లి చేసుకోవడం డౌటే అనే అనుమానాలు వచ్చాయి. కానీ నయన్ విఘ్నేష్ పెళ్లి చేసుకుని అలాంటి వారికి షాక్ ఇచ్చారు.

Ads

ఇదిలా ఉంటే అసలు నయనతార గతంలో శింబు తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. చాలా కాలం పాటు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం తో విడిపోయారు. నయనతార విఘ్నేష్ శివన్ లు కలుసుకోవడానికి కారణం మాత్రం శింబునే. విఘ్నేష్ శివన్ శింబులు ఓకే స్కూల్ లో చదువుకున్నారు. విఘ్నేష్ తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి శింబు సినిమాల్లో అవకాశం కల్పించాడు.

Ad

విఘ్నేష్ ఫస్ట్ సినిమా పోడా పోడి లో శింబు హీరోగా నటించగా నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సమయం లోనే విఘ్నేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు వచ్చాయి. అలా అవకాశం ఇచ్చి విఘ్నేష్ దర్శకుడి గా ఎదగటానికి….నయన్ విఘ్నేష్ ల మధ్య పరిచయం ఏర్పడటానికి నయన్ మాజీ ప్రియుడు శింబునే కారణం అయ్యాడు.