సెలబ్రెటీలు, రాజకీయాల జీవితాలకు సంబంధించి అందరికీ సంబంధించిన జాతకాలను చెబుతూ వార్తలలో నిలుస్తుంటాడు వేణు స్వామి. సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పడం అది వాస్తవం అవ్వవడంతో మనోడు తెగ పాపులర్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి తన నోటికి వచ్చినవి ఏవో చెబుతూ వస్తున్నాడు. 2014 సమయంలో కృష్ణ, విజయనిర్మల గారి జాతకాలు చూసి 2020లో మీ ఇద్దరిలో ఒకరు చనిపోతారని చెప్పాను. ఇద్దరిలో ఒకరు చనిపోతారని ఎప్పుడైతే ఓపెన్ గా చెప్పానో అప్పటి నుంచి వారు దూరం పెట్టారు అని పేర్కొన్నాడు. ఇక పవన్ కళ్యాణ్, శ్రీజ జాతకాలు దాదాపు ఒకటేనని వారిద్దరి జాతకాల్లో కుజుడు నీచంలో ఉన్నాడని వేణు స్వామి చెప్పారు.
Advertisement
పవన్ కళ్యాణ్ కి నాలుగో పెళ్లి కూడా జరుగుతుందని, అదేవిధంగా శ్రీజ కూడా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేసి మెగా అభిమానులతో చివాట్లు తిన్నాడు. వైవాహిక జీవితంలో లేడి సూపర్ స్టార్ నయనతార, జేజమ్మ అనుష్క, నేషనల్ క్రష్ రష్మిక మందన్న అందాల ముద్దుగుమ్మ విజయం సాధించలేరని తెలిపారు. వీరిలో గురువు నీచంలో ఉన్నారని తెలిపారు. దీని వల్లనే వీరికి సంసార సుఖం ఉండదని తెలిపారు. అందుకే సమంతకు ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రభాస్ కు కూడా గురువు నీచంలో ఉన్నారని తెలిపారు. దీంతో ఆయన సంసార జీవితం సరిగ్గా ఉండదని తెలిపారు. ఇక కర్ణాటక రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రష్మిక ఎంపీగా పోటీ చేయనుందని వేణు స్వామి చెప్పారు. ఆమె జాతకంలో అలా రాసిపెట్టి ఉందని అన్నారు. ఇక తాజాగా మరో పెద్ద బాంబు పేల్చారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, హీరోయిన్ గా ఉన్న ఇద్దరు వ్యక్తులు త్వరలోనే చనిపోతారు అంటూ షాకిచ్చారు.
Advertisement
Also Read : Jetty movie review:జెట్టి మూవీ రివ్యూ & రేటింగ్.. హిట్టు పడ్డట్టేనా..?
దీంతో ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. వేణు స్వామి వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు స్పందించారు. సమంత నాగచైతన్య వాళ్లది పర్సనల్ మ్యాటర్ అసలు ఈ విషయం ఆయనకు అవసరం లేదు. వారి వ్యక్తిగత జీవితంలోకి తల దూర్చడానికి నువ్వు ఎవరు? అంతేకాదు ఎవరో ఇండస్ట్రీలో ఏదో అవుతుంది అంటున్నావు అది కరెక్టేనా అంటూ ఆయన మాటలను తప్పుపట్టారు. ఇటీవల పాన్ ఇండియా స్టార్ గా మారి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న ఓ హీరో ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న టాప్ హీరోయిన్ త్వరలో చనిపోతారని వేణు స్వామి చెప్పాడు. దీంతో ఆయనను ఏకీ పారేశారు ఇమ్మంది రామారావు. మార్కెట్ లో తన స్ట్రాటజీ పెంచుకోవడానికి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఈ మాటలను అసలు నమ్మొద్దని ఈ వ్యాఖ్యలు తప్పు అంటూ ఇమ్మంది రామారావు అభిప్రాయ పడ్డాడు. వేణుస్వామి వ్యాఖ్యలు నిజమవుతాయో లేక అలా అనేశాడా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Also Read : చిరంజీవితో మగధీర గుర్రానికి ఉన్న సెంటిమెంట్ ఏంటో తెలుసా..? దాని కోసం ఏం చేశారంటే..?