Home » చిరంజీవితో మ‌గ‌ధీర గుర్రానికి ఉన్న సెంటిమెంట్ ఏంటో తెలుసా..? దాని కోసం ఏం చేశారంటే..?

చిరంజీవితో మ‌గ‌ధీర గుర్రానికి ఉన్న సెంటిమెంట్ ఏంటో తెలుసా..? దాని కోసం ఏం చేశారంటే..?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో సెంటిమెంట్ లు చాలా కామ‌న్. హీరోయిన్ అందంగా లేక‌పోయినా ఒక్క హిట్ పడితే చాలు నెక్స్ట్ సినిమా కోసం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్యూ క‌డుతుంటారు. అదే ఎంత అందంగా ఉన్నా స‌రే వ‌రుస ఫ్లాప్ లు ప‌డుతుంటే ఐర‌న్ లెగ్ అంటూ అస‌లు ఒక్క ఆఫ‌ర్ కూడా ఇవ్వ‌రు. కేవ‌లం హీరోయిన్ ల విష‌యంలోనే కాదు సినిమాకు ముహూర్తం పెట్టిన‌రోజు నుండి రిలీజ్ డేట్ వ‌రకూ ఇలా అన్నీ సెంటిమెంట్ ల మీద‌నే న‌డుస్తుంటాయి. ఇక హీరోల‌కు కూడా కొన్ని సెంటిమెంట్ లు ఉంటాయి.

Advertisement

అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని సెంటిమెంట్ ల‌ను ఫాలో అవుతుంటారు. ఈ నేప‌థ్యంలోనే చిరు బ్రూష్లీ సినిమా కోసం ఓ సెంటిమెంట్ ను ఫాలో అయ్యార‌ట‌. ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం….రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన మ‌గ‌ధీర ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవస‌రం లేదు. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. చిరుత‌తో ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్ ను మ‌గ‌ధీర సినిమా స్టార్ హీరోగా ఇండ‌స్ట్రీలో నిల‌బెట్టింది.

Advertisement

ఇక ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ చేసిన గుర్ర‌పు స్వారీని ఎవ్వ‌రూ మ‌ర్చిపోరు. అయితే రామ్ చ‌ర‌ణ్ సినిమాలో న‌ల్ల‌గుర్రం పై స్వారీ చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. సినిమాలో మ‌గ‌ధీర గుర్రాన్నే వాడాల‌ని చిరు చెప్పార‌ట‌. కాగా బ్రూష్లీలో గెస్ట్ అపీయ‌రెన్స్ ఇచ్చిన మెగాస్టార్ చ‌ర‌ణ్ కు ఆపోజిట్ గా త‌నకు తెల్ల‌గుర్ర‌మే కావాల‌ని అన్నార‌ట‌. బ్రూష్లీ క్లైమాక్స్ లో చిరంజీవి తెల్ల‌గుర్రం పై క‌నిపిస్తారు.

అయితే చిరు మ‌గ‌ధీర హిట్ సెంటిమెంట్ తోనే చ‌ర‌ణ్ ను న‌ల్ల‌గుర్రం పై నటించాల‌ని త‌న‌కు తెల్ల‌గుర్రం కావాల‌ని చెప్పారు. దాంతో దాంతో చిత్ర‌యూనిట్ తెల్ల‌గుర్రాన్ని వెతికి మ‌రీ చిరు కోసం తీసుకువ‌చ్చార‌ట‌. అయితే బ్రూష్లీ విష‌యంలో మాత్రం సెంటిమెంట్ వ‌ర్కౌట్ అవ్వ‌లేద‌ని అనిపించింది. ఆ సినిమాకు మిక్స్డ్ టాక్ వ‌చ్చింది.

Visitors Are Also Reading