Home » ఒక్క హ‌గ్ తో 5 ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు..అవి ఏంటంటే..?

ఒక్క హ‌గ్ తో 5 ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు..అవి ఏంటంటే..?

by AJAY
Ad

మనిషికి డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యం. ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే జీవితం వృధానే. ఆరోగ్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శారీరక ఆరోగ్యం అయితే మరొకటి మాన‌సిక ఆరోగ్యం. ఒక వ్యక్తి మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అతడిని సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని అంటూ ఉంటారు. ఇక ఆరోగ్యంగా ఉండటం కోసం మంచి పోషకాలు ఉన్న భోజనం తీసుకోవడంతో పాటు వ్యాయామం తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఈ విషయం చాలామందికి తెలుసు.

Advertisement

అయితే హగ్ చేసుకోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. మనదేశంలో హ‌గ్ చేసుకునే కల్చర్ తక్కువగా ఉంటుంది. కానీ ప్రాశ్చాత్య‌ దేశాల్లో స్నేహితులను కలిసినా కుటుంబ సభ్యులను కలిసినా హర్ట్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వారి నుండి దూరంగా వెళుతున్నా హగ్ చేసుకుని వారికి వీడ్కోలు పలుకుతారు.

Advertisement

అయితే మన దగ్గర మాత్రం కొన్ని సందర్భాల్లో మాత్రమే కౌగిలించుకుంటారు. ఇక‌ కౌగలింతల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కౌగిలింత వల్ల మానసిక ఆరోగ్యమే కాకుండా శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. డిప్రెషన్ తగ్గిపోయి మానసిక స్థితి మెరుగుపడుతుందట. అంతేకాకుండా ఆందోళనలో ఉన్నవారికి హగ్ ఇస్తే వెంటనే ఆందోళన తగ్గిపోతుందని చెబుతున్నారు. అదేవిధంగా ఒత్తిడి నుంచి కూడా అతి త్వరగా రిలాక్స్ లభిస్తుందని చెబుతున్నారు.

మెదడులో చురుకుదనం పెరుగుతుందని సూచిస్తున్నారు. దాంతో ఒత్తిడి తగ్గిపోవడం వల్ల డయాబెటిస్ గుండె జబ్బులు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం కూడా ఉండదని సూచిస్తున్నారు. ఇక హగ్ చేసుకోవడం వల్ల టైమర్ గ్రంధి ఉత్తేజాన్ని పొంది రోగనిరోగ శక్తిని బలోపేతం చేస్తుందట. దానివల్ల రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యం బారిన‌ పడకుండా ఉంటారట. అదే విధంగా జీవిత భాగస్వాములు తరచూ హ‌గ్ చేసుకోవడం వల్ల యవ్వనంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ : దేవుడి కాన్సెప్ట్ తో వ‌చ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన 5 సినిమాలు ఇవే..!

Visitors Are Also Reading