వంద కోట్ల విలువ కలిగిన లగ్జరీ హెలికాప్టర్ కొనుగోలు చేసిన మొట్టమొదటి భారతీయుడిగా నిలిచారు రవిపిళ్లై. ఈయన కేరళకు చెందిన ఆర్‌పీ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ బీ.రవిపిళ్లై 100 కోట్ల విలువైన ఎయిర్ బస్ హెచ్-145 హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. ఇంత లగ్జరీ చాపర్‌ను సొంతం చేసుకున్న మొదటి భారతీయుడిగా పిళ్లై నిలిచారు. ప్రస్తుతం, ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1,500 హెచ్ 145 చాపర్లు మాత్రమే తిరుగుతున్నాయి. కాగా.. మార్చి 20 ఆదివారం రోజు ఈ హెలికాప్టర్‌లో ఆర్‌పీ గ్రూప్స్ వైస్ చైర్మన్ కోవలం నుంచి ది రవిజ్ అష్టముడి ఫైవ్‌స్టార్ హోటల్ వరకు ప్రయాణించారు.
Advertisement
Advertisement
68 ఏళ్ల బిలియనీర్ బీ. రవి పిళ్లై సందప విలువ ప్రస్తుతం $2.5 బిలియన్ డాలర్లు. రవిపిళ్లైకి చెందిన వివిధ కంపెనీలలో సుమారు 70వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆయన యూఏఈ నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
హెచ్-145 హెలికాప్టర్ అత్యాధునిక భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో ఫైలెట్‌తో పాటు ఏడుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఈ హెలికాప్టర్ సముద్ర మట్టానికి 20వేల అడుగుల ఎత్తు నుంచి కూడా ల్యాండింగ్, టేకాఫ్ చేయగలదు.
Also Read : 23rd march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!