Home » 23rd march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

23rd march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

దేశవ్యాప్తంగా రెండో రోజు పెట్రోల్ ధ‌ర‌లు పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 84 పైసలు పెంచారు. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110, డీజిల్‌ ధర రూ. 96.36 కాగా విజయవాడలో పెట్రోల్ రూ.111.88, డీజిల్‌ రూ.97.90 గా ఉంది.

Advertisement

INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

భారత్‌లో కొత్తగా 1,778 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 62 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23,087 యాక్టివ్‌ కేసులున్నాయి

హైదరాబాద్ లోని బోయిగూడ స్క్రాప్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు సజీవదహనమ‌య్యారు. ఘటనా స్థలాన్ని మంత్రి మంత్రి తలసాని ప‌రిశీలించారు. అగ్నిప్రమాదంపై రాష్ట్ర ప్ర‌భుత్వం విచారణకు ఆదేశించింది.

Ap cm jagan

Ap cm jagan

ఏపీలో సీఎం జ‌గ‌న్ నేడు దిశ పెట్రోలింగ్‌ వాహనాలను ప్రారంభించనున్నారు. మహిళల భద్రత కోసం అందుబాటులోకిరానున్న 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలు.

Advertisement

నేడు ఉత్తరాఖండ్‌ సీఎంగా పుష్కర్‌సింగ్‌ ధామి ప్రమాణస్వీకారం చేస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్న ధామి..కాగా ఈ కార్య‌క్ర‌మానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజ‌రుకానున్నారు.

 

ఢల్లీలో నేడు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను తెలంగాణ మంత్రులు క‌ల‌వ‌నున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రుల బృందం కోర‌నుంది.

తెలుగుతో పాటు 13 భాషల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎంట్రెన్స్ ను నిర్వ‌హించ‌నుంది. పూర్తి వివరాలు nta వెబ్ సైట్‌లో పొందుప‌ర్చ‌నున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ పీజీ కోర్సులకి కూడా కామన్ ఎంట్రెన్స్ కి కూడా చాలా యూనివ‌ర్సిటీలు అంగీకారం తెలిపాయి.

ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో నెల‌లోగా సివిల్ సర్వీసెస్ అకాడ‌మీ ఏర్పాటు చేస్తున్న‌ట్టు వీసీ ర‌వీంద‌ర్ యాద‌వ్ తెలిపారు.

కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రికాద‌ని తెలిపింది. అయితే టీకాలు వేసుకోని వారిలోనే వైర‌స్ ఎక్కువ మ్యూటేష‌న్లు చెందుంతుంద‌ని కాబ‌ట్టి టీకా త‌ప్ప‌ని స‌రిచేసే అధికారం త‌మ‌కు ఉంద‌ని పేర్కొంది.

మ‌రో రెండు బ్యాంకుల‌ను ప్రైవేటీక‌రించేలా కేంద్రం అడుగులు వేస్తోంది. ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంక్, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కేంద్రం ప్రైవేటీక‌రించే ఆలోచ‌న‌లో ఉంది.

Visitors Are Also Reading