Telugu News » Blog » భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ లలో అత్యధిక వికెట్లు తీసింది వీరే.. !

భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ లలో అత్యధిక వికెట్లు తీసింది వీరే.. !

by Anji
Ads

భారత్-న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు వన్డే సిరీస్ లు చాలానే జరిగాయి. అందులో ఎక్కువగా భారత జట్టు సిరీస్ లను కైవసం చేసుకుంది. ఈ మధ్య న్యూజిలాండ్ పై భారత జట్టు ఓటమి చెందుతుంది. 2019 ప్రపంచ కప్ టీ-20లో న్యూజిలాండ్ జట్టుపై సెమిస్ లో భారతజట్టు ఓటమి చెందింది. 2022 టీ-20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టుపై న్యూజిలాండ్ ఓటమి చెందింది. భారత్ ఇంగ్లాండు జట్టుపై ఓటమి చెందింది. ఇప్పటివరకు భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ -5 బౌలర్లలో కేవలం ఒకే ఒక్క కివీస్ బౌలర్ మాత్రమే చేరాడు. 

Advertisement

New Zealand bowler Kyle Mills will captain the Black Caps on tour of Sri  Lanka | Cricket News | Sky Sports

ఇప్పటివరకు భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా జవగల్ శ్రీనాథ్ రికార్డు సృష్టించాడు. మొత్తానికి టాప్-5 బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ ప్లేయర్ కేవలం ఒక్కడే చేరాడు. న్యూజిలాండ్ తో జరిగిన 30 వన్డేలలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీనాథ్ 51 వికెట్లు పడగొట్టడం విశేషం. ఆ సమయంలో అతని బౌలింగ్ సగటు 20.41, ఎకానమీ రేటు 3.93. భారత జట్టు తరుపున న్యూజిలాండ్ పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు బౌలర్ శ్రీనాథ్. 

Also Read :  వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఇక నుంచి మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు.. ఎలాగంటే ?

Advertisement

 

ఇక ఈ జాబితాలో భారత మాజీ వెటరన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రెండో స్థానంలో ఉన్నాడు. కివీస్ పై 31 వన్డేలలో 39 వికెట్లు తీశాడు. కుంబ్లే బౌలింగ్ సగటు 27.84, ఎకానమీ రేటు 4.11గా నమోదు అయింది.  అదేవిధంగా భారత్-న్యూజిలాండ్ వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో కపిల్ దేవ్ మూడోస్థానంలో నిలిచాడు. కపిల్ 29 మ్యాచ్ లలో 27.60 బౌలింగ్ సగటు, 3.44 ఎకానమీ రేటుతో 33 వికెట్లను తీశాడు. న్యూజిలాండ్ బౌలర్ కైల్ మిల్స్ నాలుగవ స్థానంలో ఉన్నాడు. 29 వన్డేలలో 32 భారత ఆటగాళ్ల వికెట్లను తీశాడు మిల్స్. అతని బౌలింగ్ సగటు34.53, ఎకానమీ రేటు 4.89గా నిలిచింది. ఈ జాబితాలో టాప్-5లో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ కూడా ఉన్నాడు. జహీర్ న్యూజిలాండ్ 22 వన్డేలలో 27.73 బౌలింగ్ సగటు, 5.07 ఎకానమీ రేటుతో 30 వికెట్లను తీశాడు. 

Advertisement

Also Read :  ఆ ఫుట్ బాల్ కీలక ఆటగాడి ఖాతాలోకి మరో ప్రపంచ రికార్డు..!