సాధారణంగా జీవితంలో రకరకాల సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి విషయంలో అయితే వయస్సుతో సంబంధం ఉండదు. ఇటీవలే ఒకతను 55 ఏళ్ల వయస్సులో 25 ఏళ్ల వికలాంగురాలుని పెళ్లి చేసుకొని ఆమెకు ఓ జీవితాన్ని ఇచ్చాడు. ఈ విషయం గురించి కొందరూ అతడిని తిడుతుంటే.. మరికొందరూ ఆమెకు మంచి జీవితాన్ని అందించాడని పేర్కొంటున్నారు. ఇలా వయస్సు ల మధ్య తేడా ఎలాగైనా ఉండవచ్చు. చాలా వరకు పురుషుల వయస్సు ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్త్రీల వయస్సు కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి.
Advertisement
తాజాగా ఓ సమస్యను పరిశీలించినట్టయితే ఓ మహిళకు పెళ్లి జరిగి పదేళ్లు గడిచినప్పటికీ.. ఆమెకు పిల్లలు లేరు. కొద్ది సంవత్సరాల కింద కారు రిపేయిర్ చేయించినప్పుడు అక్కడ పని చేసే ఓ 23 ఏళ్ల మెకానిక్ తో పరిచయం ఏర్పడింది. తాను నన్ను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నానడి పేర్కొన్నాడు.. నేను కూడా అతడిని ఇష్టపడ్డాను. ఆ తరువాత మేము చాలా దగ్గరయ్యాం. ఇప్పుడు అతను నీ ఆస్తిని నా పేర రాయించు.. నీకు కావాల్సిన పిల్లలను నేను ఇస్తానంటూ.. తన రంగును బయటపెట్టాడు. అతనిపై విపరీతంగా కోపం వచ్చినప్పటికీ ఏమి చేయలేకపోయాను. ఇప్పుడు అతనితోనే బతకాలి అనిపిస్తోంది. ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదు. నా సమస్యకు పరిష్కారం చూపించండి ఓ మహిళా వేడుకుంది. కేవలం ఇదే ఘటన కాదు.. ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటాయి. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Also Read : కోపం ఎందుకు వస్తుంది…? దాని వల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటి?
పెళ్లి జరిగి పదేళ్లు అవుతున్నా పిల్లలు లేరంటే.. సమస్య మీదో.. లేక మీ భర్తతో వైద్యులను సంప్రదించడం చాలా ఉత్తమం. ముఖ్యంగా 35 ఏళ్ల వయస్సు ఉన్న మీరు 23 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకోవాలనుకోవడం కేవలం ఆకర్షణతోనే మీకు ఆ ఆలోచన కలిగిందని భావించవచ్చు. ఆస్తిని రాసివ్వు.. నీకు పిల్లలను ఇస్తానని చెప్పాడంటే.. అతనికి మీ కంటే కూడా మీ ఆస్తిపైనే ఎక్కువగా ఆశ ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. సమాజంలో ఇలా మోసం చేసే వాళ్లు చాలా మంది ఉంటారు జాగ్రత్తగా ఉండటం బెటర్. అతని జ్ఞాపకాల నుంచి మీరు బయటపడాలంటే మానసిక నిపుణుడిని కలవండి. భార్య, భర్తలు ఇద్దరూ కలిసి మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి. పిల్లలు లేనంత మాత్రానా భర్తపై ఇష్టంగా ఉండకపోవడం ఏంటి ? మీ మధ్య ఏమైనా ఇబ్బందులున్నట్టయితే ఫస్ట్ వాటిని పరిష్కరించుకుంటే మీ జీవితం సాఫీగా సాగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దయచేసి ఇలాంటి ఆకర్షణ, వ్యామోహంతో నిండు జీవితాన్ని పాడు చేసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు.