సినిమా ఇండస్ట్రీలో వారసత్వమే రాజ్యమేలుతుందనేది జగమెరిగిన సత్యం. హీరోల పిల్లలు హీరోలుగా.. హీరోయిన్స్ పిల్లలు హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. ఇలా వచ్చిన వారే ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్‌గా కొనసాగుతున్నారు. తెర వెనుక ఉండే వీరందరినీ గైడ్ చేసే డైరెక్టర్స్ పిల్లల సంగతి ఏమిటి..? వారు ఏమి చేస్తుంటారు..? ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్స్ పిల్లల గురించి తెలుసుకుందాం.
రాజమౌళి-మయూఖ
Advertisement
టాలీవుడ్‌లో దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంద శాతం సక్సెస్ రేటు ఉంది. జక్కన్న చెక్కిన ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాల్సిందే. రాజమౌళి- రమ దంపతులకు ఇద్దరు పిల్లలు. కార్తీకేయ, మయూఖ. రాజమౌళి కుటుంబం గురించి ఇండస్ట్రీ వారందరికీ తెలిసిందే. కొడుకు కార్తీకేయ తండ్రి వెనుక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగా.. కూతురు మయూఖ మాత్రం చదువుకుంటుంది. బాహుబలి సినిమాలో చిన్న చిన్న పాత్రలో మెరిసిన మయూక ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
వంశీపైడిపల్లి-ఆద్య
టాలీవుడ్‌లో మరొక అగ్ర దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇతనికి ఒక కూతురు కలదు. ఈమె పేరు ఆధ్య. మహేష్ బాబు కూతురు సితార, ఆధ్య మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్‌ను రన్ చేస్తున్నారు. చిన్న వయసు లోనే ఇద్దరు టాలెంటెడ్ స్పీకర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీరి ఛానెల్ పేరు ఏఎన్ఎస్. ఏఎన్ఎస్ అంటే ఆధ్యా అండ్ సితార. ఈ ఛానెల్‌లో ఏకంగా మహేష్ ను పరిచయం చేశారు ఈ ఇద్దరు చిన్నారులు.
పూరి జగన్నాథ్-పవిత్ర
టాలీవుడ్ దర్శకుల్లో ఒకరైన పూరిజగన్నాథ్‌కు కూతురు, కుమారుడు కలరు. కూతురు పేరు పవిత్ర,కుమారుడి పేరు ఆకాశ్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బుజ్జిగాడు సినిమాలో తన ఇద్దరు పిల్లలను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. బుజ్జిగాడులో చిన్నప్పటి త్రిష, ప్రభాస్ పాత్రలను పోషించింది పూరి జగన్నాథ్ పిల్లలే కావడం విశేషం. ఇక ఆ తరువాత పూరిజగన్నాథ్ కొడుకు ఆకాశ్ ఇండస్ట్రీలోనే సెటిలయ్యాడు. ఎంతో మంది హీరోలకు హిట్ ఇచ్చిన పూరి తన కొడుకును స్టార్‌హీరోగా చూసుకోవాలనుకుంటున్నాడు. హీరోగా మంచి సినిమా ఒకటి పడితే ఆకాశ్ స్టార్స్ స్టేటస్ అందుకునే అవకాశముంది. కూతురు పవిత్ర కూడా ఇండస్ట్రీలోనే స్థిర పడాలనుకుంటుంది. కాకపోతే తెరమీద కాదు. తండ్రి మాదిరిగానే తెర వెనుకే ఉండి సినిమాను నడిపించాలనుకుంటుంది. డైరెక్టర్ కావడానికి ఆ దిశగా అడుగులు వేస్తుంది పవిత్ర.
Advertisement
సుకుమార్-సుకృతి
ఇటీవలే పాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్. తబిత- సుకుమార్ దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరి పేర్లు సుకృతి, సుక్రాంత్. వీరిద్దరూ చిన్నపిల్లలే. అయినా సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది సుకృతి. ఇటీవల తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఓ పాట పాడి విడుదల చేసింది. ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది సుకృతి. ముఖ్యంగా సుకుమార్ మేకింగ్ స్టైల్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
మారుతి-అభిష్ట
టాలీవుడ్ దర్శకుల్లో ఒకరు మారుతి. ప్రతి రోజు పండుగ సినిమాతో ప్రేక్షకులకు తన కూతురును పరిచయం చేశారు డైరెక్టర్ మారుతి. మారుతి పెద్ద కూతురు అభిష్టతో ఓ పాత్ర చేయించాడు. ఓ బావ మా అక్కను సక్కగా చూస్తావా అంటూ రాశిఖన్నా చెల్లెల్లలో అభిష్ట ఒకరు. ఈ సినిమాతో భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నఅభిష్ట ప్యూచర్‌లో సినిమాల్లో నటించే అవకాశం ఉంది.
తేజ-ఐలా
దర్శకుడు తేజకు ముగ్గురు పిల్లలు. వారిలో చిన్న కొడుకు అనారోగ్యంతో మరణించాడు. పెద్ద కొడుకు అమిత్ నాలుగేళ్ల వయసులో చిత్రం సినిమాలో నటించాడు. ప్రస్తుతం తన కొడుకును హీరోగా పనిలో తేజ ఉన్నాడు. కూతురు ఐలా అమెరికాలో మాస్టర్స్ చేస్తుంది. చదువుకుంటూనే తాను ఓ మంచి స్పీకర్‌గా అమెరికాలో బెర్కిలీ ఫోరమ్ తరుపున పలు కార్యక్రమాల్లో పాసర్టిసిపేట్ చేస్తుంది. యువత మేల్కోవాలని వారి ఐడియాస్‌ను, వ్యాపార దిశలో అభివృద్ధి చేసుకోవాల్సిందిగా చెబుతున్నారు ఐలా.
గుణశేఖర్-నీలిమ
దర్శకుడు గుణశేఖర్‌కు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. అనుష్క నటించిన రుద్రమదేవి చిత్రానికి గుణశేఖర్ పెద్ద కూతురు నీలిమ నిర్మాతగా వ్యవహరించింది. చిన్న కూతురుకి కూడా సినీ పరిశ్రమ అంటే ఎంతో ఇష్టమట. త్వరలోనే తాను ఏదో ఒక విభాగంలో పని చేయనున్నట్టు చెప్పారు గుణశేఖర్.
Also Read :
హీరో సుమన్ నిజంగే 117 ఎకరాలు ఆర్మీ కి ఉచితంగా ఇచ్చారా ? ఇందులో ఉన్న నిజం ఇదే !