Home » 2017లో ఐశ్వర్య రాయ్ విడాకుల గురించి చెప్పింది ఎవరో..? ప్రూఫ్స్ తో వేణు స్వామి బండారం బయటపెట్టిన బాబు గోగినేని….!

2017లో ఐశ్వర్య రాయ్ విడాకుల గురించి చెప్పింది ఎవరో..? ప్రూఫ్స్ తో వేణు స్వామి బండారం బయటపెట్టిన బాబు గోగినేని….!

by AJAY
Ad

ప్రముఖ హేతువాది, బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని సామాజిక రాజకీయ సినిమా అంశాలపై తనదైన స్టైల్ లో స్పందిస్తుంటారు. ముఖ్యంగా మూఢనమ్మకాలపై బాబు గోగినేని పోరాటం చేస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా బాబు గోగినేని కి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. దాంతో ఆయన తరచూ ఏదో ఒక అంశంపై పోస్ట్ లు పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే బాబు గోగినేని తాజాగా ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి పై సెటైర్ల వర్షం కురిపించారు.

Advertisement

వీరస్వామి సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులకు జ్యోతిష్యం చెబుతుంటారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు…? ఎవరు ఓడిపోతారు లాంటి విషయాలతో పాటు ఏ సెలబ్రిటీ జంట ఎప్పుడు విడిపోతుంది. సినిమాల్లో ఎవరు సక్సెస్ అవుతారు లాంటి విషయాలను కూడా చెబుతుంటారు. అయితే సమంత నాగచైతన్య విషయంలో వేణు స్వామి చెప్పిన జ్యోతిషం నిజమైంది. దాంతో స్వామి జ్యోతిషానికి కూడా క్రేజ్ పెరిగింది.

 

Advertisement

కాగా తాజాగా బాబు గోగినేని వేణు స్వామి గతం లో ఐశ్వర్య రాయ్ పై చేసిన కామెంట్స్ ను గుర్తు చేస్తూ సెటైర్ లు కురిపించారు. గతంలో వేణు స్వామి మాట్లాడుతూ… ఐశ్వర్య రాయ్ జాతకం ప్రకారం తన భర్తతో విడాకులు తీసుకుంటుందని అన్నారు. అయితే ఇప్పటికీ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ ఎంతో అన్యోన్యంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక బాబు గోగినేని తన పోస్ట్ లో…. “నాకు జోతిష్యం రాదు” అని దండంపెట్టి వెళ్ళిపోయి, కరోనా డేట్స్ మార్చి మార్చి, తిప్పి తిప్పి చెప్పి కూడా ఓడిపోయి, ఏదో ఒక్క సెలెబ్రిటీ కపుల్ విడాకుల గురించి రాయి తగిలే సరికి, నాగరాజు తో వీడియోలు చేయించుకుని, మళ్ళీ రెచ్చిపోయి, సెలెబ్రిటీలూ, డివోర్సులూ అని అంటున్నాడా? 2017 లో ఐశ్వర్య రాయ్ విడాకుల గురించి చెప్పినది ఎవరో? “తలకాయ మీద మెడకాయ” గురించి మాట్లాడిన వాడేనా ఎవరినీ సంతోషం గా ఉండనివ్వడుగా? అయినా, ఎంత బెదిరించినా రెమెడీల కోసం వాళ్ళు జోతిష్యం తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్తారు గానీ ఎవరంటే వాళ్ళని అడుగుతారా ఏమిటీ? అంటూ సెటైర్ లు కురిపించారు.

Also read :

కాపీ ట్యూన్ల పై స్పందించిన త‌మ‌న్…ఆల్బ‌మ్ క్రెడిట్ డైరెక్ట‌ర్ ప‌ర‌షురామ్ కే ఇస్తున్నా అంటూ..!

విడదల రజినీ నాకు అందుకే నచ్చదు, నేను వైసీపీ కాదు….క్లారిటీ ఇచ్చిన శ్రీరెడ్డి…!

 

Visitors Are Also Reading