వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో రెండో టెస్ట్ లో ఇంగ్లండ్ ఆటగాడు ఓలీ పోప్ సంచలన క్యాచ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. పోప్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ తో న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ ని పెవిలియన్ కు పంపాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 25 ఓవర్ వేసిన జాక్ లీచ్ బౌలింగ్ నికోల్స్ రివర్స్ స్వీప్ ఆడాడు. అయితే బంతి అనూహ్యంగా బ్యాట్ ఎడ్జ్ తీసుకొని అతని హెల్మెట్ కి తాకి సిల్లీ పాయింట్ దిశగా వెల్లింది.
Advertisement
ఈ నేపథ్యంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న పోప్ ఒటి చేతితోనే అద్భుతమైన స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 30 పరుగులు చేసిన నికోల్స్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Advertisement
It's that man again 🤩
Leachy with another breakthrough after Ollie Pope's fantastic reactions 🔥
Henry Nicholls is gone for 30… #NZvENG pic.twitter.com/n8cTfDfIQd
— Cricket on BT Sport (@btsportcricket) February 25, 2023
అదేవిధంగా కివీస్ బ్యాటర్ మిచెల్ ను కూడా ఓ అద్బుత క్యాచ్ తో పోప్ పెవిలియన్ పంపాడు. 36వ ఓవర్ లో లీచ్ బౌలింగ్ లో సిల్లి పాయింట్ లో.. మిచెల్ ఇచ్చిన ఓ స్టన్నింగ్ క్యాచ్ ను కూడా పోప్ అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 209 పరుగులకు ఆలౌట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో 203 పరుగులు చేసి మూడు వికెట్లు నష్టపోయింది. మరోవైపు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 435 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లెర్ చేసింది.
Also Read : గుజరాత్ టైటాన్స్ కు షాక్!రూ.4 కోట్ల ఆటగాడు దూరం!