Home » చిరంజీవి పదోతరగతి మెమో చూశారా..? ఆయన ఎప్పుడు పుట్టాడంటే..?

చిరంజీవి పదోతరగతి మెమో చూశారా..? ఆయన ఎప్పుడు పుట్టాడంటే..?

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎవ్వరి సపోర్టు లేకుండా ఒక్కడే ఎదగడం అంటే మాములు విషయం కాదు.. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేసి ఇక్కడే బతకాలి అని డిసైడ్ అయిపోయి ఇండస్ట్రీకి వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగి చాలా మందికి ఇన్ స్పిరేషన్ గా నిలిచాడు. ప్రస్తుతం ఆయన ప్రస్థానం ఉన్నతస్థానంలో ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఆయన యంగ్ స్టార్స్ తో పోటీపడి సినిమాలు చేస్తూ.. తనకెవ్వరూ పోటీ లేరు. పోటీకి రారు అనేంతగా సినిమా కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చేసి చూపిస్తున్నాడు చిరంజీవి.

Advertisement

Advertisement

ఇదిలా ఉంటే.. చిరంజీవి ఒకప్పుడు చదువుకున్న పదోతరగతి సర్టిఫికేట్ కి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చిరంజీవి పేరు కే.ఎస్.ఎస్. వరప్రసాద్ రావుగా ఉంది. వాళ్ల నాన్న పేరు వెంకట్ రావు.. ఆయన పుట్టిన తేదీ 22-08-1955 సంవత్సరంగా ఉంది. చిరంజీవి పెనుగొండలో జన్మించినట్టుగా ఆ సర్టిఫికేట్ లో ఉండటం విశేషం. అన్నీ వివరాలతో ఓ సర్టిఫికేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన మెగాస్టార్ అభిమానులు చాలా సంతోషానికి లోనవుతున్నారు. ఒకప్పుడు శివ శంకర వరప్రసాద్ గా ఉండి ప్రస్తుతం చిరంజీవిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకోవడం అంటే అంత ఆషామాషీ కాదు. అలాంటిది అప్పటి పేరును చూసినప్పుడు ఆయన అప్పటికీ ఇప్పటికీ ఎంతలా అభివృద్ధి చెందాడు అనేదానికి ప్రతీకగా దీన్ని చూపిస్తూ వాళ్ళు చాలా ఆనంద పడుతున్నారు.

Also Read :  ఈ మంచి లక్షణాల వల్లే.. మెగాస్టార్‌ చిరంజీవి అందరివాడు అయ్యారు..!

Visitors Are Also Reading