సాధారణంగా మన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి ఫోటోలను గుర్తుగా ఇంట్లో పెట్టుకుంటాం. చనిపోయిన వారి యొక్క దీవెనలు ఎల్లవేళలా మనకు ఉండాలని ఇంట్లో వారి ఫోటోలను ప్రేమానురాగాలకు గుర్తుగా పెట్టుకుంటాం.
Advertisement
Also Read: ఆలీ అల్లుడు డాక్టర్ కాదా..? అసలు ఈ విషయం బయటపెట్టింది ఎవరో తెలుసా ?
మరికొందరూ వారి ఆత్మ శాంతి కలగాలని ప్రతీ రోజు దీపం వెలిగిస్తుంటారు. ఎక్కువగా చనిపోయిన వారి ఫోటోలను గోడకు వేలాడ దీస్తారు. ఇలా చేయడం మంచిదేనా? చనిపోయిన వారి ఫోటోలను ఏ దిక్కుకు ఉంచాలి? అనే విషయాల గురించి ఇప్పుడుమనం తెలుసుకుందాం.
ఇంట్లో మరణించిన వారి ఫోటోలను ఎక్కువగా ఉంచకూడదు. చనిపోయిన వారి ఫోటోలను ఎక్కువగా పెట్టుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశముంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. అసలు మరణించిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచి దేవుళ్లతో సమానంగా పూజ చేయడం అస్సలు మంచిది కాదు. ఇలా చేస్తే దేవతల ఆగ్రహానికి కుటుంబ సభ్యులు గురయ్యే అవకాశముంటుంది. దీంతో కుటుంబంలో కలహాలు, ఇబ్బందులు, ఆందోళన ఏర్పడి ప్రశాంతత కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మరణించిన వారి ఫోటోలను అస్సలు పడకగదిలో ఉంచకూడదు.
Advertisement
Also Read : ఈ విషయాలు తెలిస్తే ఆవాల ఆకులను అస్సలు వదిలిపెట్టరు..!
మరో విశేషం ఏంటంటే.. బతికి ఉన్న వారి ఫోటోల పక్కన చనిపోయిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదు. ఇలా చేస్తే బతికి ఉన్న వారి ఆయుస్సు కూడా తగ్గుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశముంటుంది. ఏ దిక్కున చనిపోయిన వ్యక్తుల ఫోటోలను ఉంచడం మంచిది, అలా ఫోటోలను పెడితే ఎలాంటి శుభ ఫలితాలు దక్కుతాయో వాస్తు శాస్త్రం ఓ క్లారిటీని ఇచ్చింది. చనిపోయిన పితృదేవతల ఫోటోలను ఉత్తరం వైపు చూసే విధంగా దక్షిణం గోడకు వేలాడదీస్తే మంచిది అని వాస్తు శాస్త్రం చెబుతోంది. దక్షిణం గోడకు ఫోటోలను వేలాడదీయడం వల్ల వారు ఉత్తరం వైపునకు చూస్తుంటారు. అలా చూడడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఇలా ప్రయత్నించండి.
Also Read : మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా..? డైట్ లో ఈ పదార్థాలను చేర్చుకోండి..!