Home » ఆలీ అల్లుడు డాక్టర్ కాదా..? అసలు ఈ విషయం బయటపెట్టింది ఎవరో తెలుసా ?

ఆలీ అల్లుడు డాక్టర్ కాదా..? అసలు ఈ విషయం బయటపెట్టింది ఎవరో తెలుసా ?

by Anji
Ad

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమెడీయన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తనదైన నటనతో పలు సినిమాల్లో నటిస్తూ ఉన్నత పొజిషన్ కి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆలీ ఓవైపు సినిమాల్లో, మరోవైపు బుల్లితెరపై హోస్ట్ గా వ్యవహారిస్తూనే రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఫస్ట్ సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టాడు ఆలీ. ఆ తరువాత మెల్లమెల్లగా ఒక్కోమెట్టు ఎక్కుతూ సినీ ఇండస్ట్రీలోనే బ్రహ్మానందం తరువాత  మోస్ట్ పాపులర్ కమెడీయన్ గా పేరు సంపాదించుకున్నాడు.

Advertisement

అంతేకాదు.. ఎవ్వరూ ఊహించని విధంగా రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఆలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఆలీ తన కూతురు పెళ్లి కోసం ఎన్నో కోట్లు చేసి అంగరంగ వైభవంగా జరిపించాడు. అంతేకాదు.. తన అల్లుడు డాక్టర్ అని, డబ్బు పరంగా పెద్ద సౌండ్ పార్టీ అంటూ పెళ్లికి ముందు వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆలీతో సరదాగా షో ఫైనల్ ఎపిసోడ్ కి సుమ హోస్ట్ గా ఆలీ గెస్ట్ గా విచ్చేసిన ఎపిసోడ్ ఇటీవలే విడుదలయింది. 

Advertisement

Also Read :  44 సినిమాలకు ఒక సెన్సార్ కట్ కూడా కానీ ఏకైక దర్శకుడు ఎవరో తెలుసా ? 

Manam News

 

ఈ తరుణంలో ఆలీని సుమ మీ అల్లుడు డాక్టర్ కదా అని అడిగింది. దీంతో ఆలీ మా అల్లుడు రోబోటిక్ ఇంజినీర్ అని ఆసక్తకరమైన సమాధానం చెప్పాడు. దీంతో అందరూ ఒక్కసారికి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆలీ మాత్రం మా అల్లుడి నాన్న, అన్న, వదిన, చెల్లి, బావ డాక్టర్స్ అని.. నా అల్లుడు మాత్రం రోబోటిక్ ఇంజినీర్ అని చెప్పుకొచ్చాడు.  అదేవిధంగా నా అల్లుడు మనసున్న వ్యక్తి అని, అందుకే మేము మా కూతురిని ఇచ్చి పెళ్లి చేశాం అని చెప్పుకొచ్చాడు. అంతేకానీ వాళ్ల డబ్బును చూసి ఇవ్వలేదన్నాడు ఆలీ. దీంతో ఆలీ అల్లుడు డాక్టర్ కాదు అనే వార్తలకు పుల్ స్టాప్ పడింది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఆలీ తన కూతురికి మంచి వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేశాడని పలువురు పేర్కొంటున్నారు.

Also Read :  1200 రూ. కోసం శోభన్ బాబు అంత రిస్క్ చేశారా..ఏంటో తెలిస్తే గ్రేట్ అంటారు..!!

Visitors Are Also Reading