Home » వామ్మో ఇదెక్క‌డి అగ్రిమెంట్‌.. దంప‌తుల మ‌ధ్య ఇలాంటి ఒప్పందాన్ని ఎవ‌రైనా చూశారా..?

వామ్మో ఇదెక్క‌డి అగ్రిమెంట్‌.. దంప‌తుల మ‌ధ్య ఇలాంటి ఒప్పందాన్ని ఎవ‌రైనా చూశారా..?

by Anji
Ad

ఒక‌ప్పుడు దాంప‌త్య బంధానికి ఎంతో విలువ ఉండేది. ఒక‌రితో మ‌రొక‌రికి ఏమాత్రం సంబంధం లేని వారు పెళ్లిబంధంతో ఒక్క‌టై స‌రికొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. పెళ్లి జ‌రిగిన త‌రువాత ఒక‌రిప‌ట్ల మ‌రొక‌రు అర్థం చేసుకోవ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది.ఇద్ద‌రి మ‌ధ్య చిన్న చిన్న బేధాభిప్రాయాలు క‌లుగ‌డం స‌హ‌జ‌మే. కొంద‌రూ దీనిని అర్థం చేసుకుని సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకుని ఉత్త‌మమైన జంట‌గా ఆద‌ర్శంగా నిలుస్తారు.

Advertisement

కొంద‌రు చిన్న గొడ‌వ‌ల‌ను పెద్ద‌గా చేసి పోలీస్ స్టేష‌న్‌, కోర్టుల వ‌ర‌కు వెళ్లి ప‌రువు తీసుకుంటారు. కొంద‌రూ గొడ‌వ‌లు కాగానే విడాకుల‌ను కోరుకుంటారు. ఇక్కడ ఓ జంట మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. వారు విడాకులు తీసుకోలేదు కానీ.. ఓ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గుజ‌రాత్‌లోని వ‌డోద‌రాకు చెందిన ఓ కుటుంబం మ‌ధ్య గొడ‌వ‌లు సంభ‌వించాయి. వీరికి 19 ఏళ్ల కింద‌ట పెళ్లి జ‌రిగింది. కొద్ది రోజుల పాటు వీరి కాపురం బాగానే సాగింది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు. ఈ మ‌ధ్య కాలంలో గొడ‌వ‌లు ఎక్కువ‌య్యాయి. ఇద్ద‌రూ వేరువేరుగా ఉండాల‌నుకున్నారు. ఓ ఒప్పందం చేసుకున్నారు. భార్య‌, పిల్ల‌లు ఉండడానికి భ‌ర్త ఇల్లు, కారు ఇచ్చాడు. ఆ త‌రువాత పిల్ల‌ల చ‌దువులు, ఆరోగ్యం విష‌యంలో ఖ‌ర్చును భ‌రించ‌డానికి అంగీక‌రించాడు. ప్ర‌తి నెల వీరికి మెయింటెన్స్ ఖ‌ర్చులకు ఇవ్వ‌డానికి ఒప్పుకున్నాడు. కోర్టుకు వెళ్లి విడాకులు మాత్రం కోర‌లేదు. అత‌ను రూ.30ల‌క్ష‌ల డ‌బ్బును ఒకేసారి ఇస్తాన‌ని చెప్పాడు.

Advertisement

అత‌ని భార్య మాత్రం ఈ ఒప్పందానికి అస‌లు ఒప్పుకోలేదు. ప్ర‌తినెల అగ్రిమెంట్ ప్ర‌కారం.. తన‌ కుటుంబాన్ని చూసుకోవాల‌ని కోరింది. అయితే ఓ సంవ‌త్స‌రం పాటు భ‌ర్త అగ్రిమెంట్ ప్ర‌కారం.. డ‌బ్బులు ఇచ్చాడు. కానీ ఆ త‌రువాత మ‌ళ్లీ వీరి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డంతో డ‌బ్బులివ్వ‌డం మానేశాడు. స‌దరు మ‌హిళ ఫ్యామిలీ కోర్టులో మెయింటెనెన్స్ కింద డ‌బ్బులు ఇప్పించాల‌ని పిటిష‌న్ వేసింది. కానీ భ‌ర్త మీద ఎలాంటి త‌ప్పుడు కేసులు, విడాకుల కోసం పిటిష‌న్ వేయ‌క‌పోవ‌డం విశేషం. ఈ విచిత్ర‌మైన కేసు ప్ర‌స్తుతం వార్త‌ల్లో నిలిచింది. దేశ‌వ్యాప్తంగా దీనికి గురించి చ‌ర్చించుకుంటున్నారు.

Also Read : 

పెళ్లి త‌ర‌వాత గొడ‌వ‌లు రాకుండా ఉండాలంటే ముందే ఈ 5 జాగ్ర‌త్తలు తీసుకోండి..!

గూగుల్ పే, ఫోన్ పే సంస్థలకు ఆదాయం ఎలా వస్తుందో మీకు తెలుసా..!!

Visitors Are Also Reading