Home » మిథాలీ వీడ్కోలుతో కెప్టెన్ గా హర్మాన్ ప్రీత్..!

మిథాలీ వీడ్కోలుతో కెప్టెన్ గా హర్మాన్ ప్రీత్..!

by Azhar
Published: Last Updated on
Ad

టీం ఇండియా మహిళల కెప్టెన్ గా గత దశబ్దకాలంగా సేవలు అందించిన మిథాలీ రాజ్ ఈరోజు అంహారతియా క్రికెట్ కు వీడ్కోలు పలికింది. గతంలోనే పొట్టి ఫార్మాట్ అయిన టీ20 కి రిటైర్మెంట్ ఇచ్చిన మిథాలీ ఈరోజు వన్డే మరియు టెస్ట్ కు కూడా వీడ్కోలు పలికింది. దాంతో ఇన్ని రోజులు టీ20 జట్టుకు కెప్టెన్ గా వ్యవరించిన హర్మాన్ ప్రీత్ కౌర్ ను వన్డే జట్టుకు కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

Advertisement

అయితే ఇప్పుడు భారత మహిళల జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టీ20తో పాటుగా వన్డే సిరీస్ లు కూడా ఆడాలి. అయితే ఈ రెండు సిరీస్ లకు తాజాగా జట్టును ప్రకటించిన బీసీసీఐ అందులో రెండు ఫార్మాట్లకు కెప్టెన్ గా హర్మాన్ ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్ గా స్మృతి మదనాను ప్రకటించింది. ఇక బీసీసీఐ ప్రకటించిన వన్డే జట్టును ఓసారి చూస్తే.. హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధాన (VC), షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (WK), ఎస్ మేఘన, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గయాక్‌వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్ (వికె), పూజా సింగ్ వస్త్రాకర్, మేఘనా వస్త్రాకర్ , రేణుకా సింగ్, తానియా భాటియా (WK), హర్లీన్ డియోల్ లు ఉన్నారు.

Advertisement

ఇక అదే విధంగా టీ20 జట్టును పరిశీలిస్తే… హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధాన (VC), షఫాలీ వర్మ యాస్తికా భాటియా (WK), ఎస్ మేఘన, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గయాక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్ (WK), పూజా సింగ్, మేఘనా సింగ్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్ లు స్థానం దకించుకున్నారు. ఈ నెల 23 నుండి ఈ పొట్టి సిరీస్ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి :

మిథాలీ రాజ్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా..?

నేను కీపర్ కావడానికి కావడానికి కారణం మా నాన్న అంటున్న పంత్…!

Visitors Are Also Reading