Ad
ప్రస్తుతం భారత జట్టుకు మూడు ఫార్మాట్లలోను మొదటి కీపర్ గా రిషబ్ పంత్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కీపర్ గా పంత్ వైట్ బాల్ ఫార్మటు లో ఆ స్థానానికి వచ్చాడు. అలాగే టెస్టులో సాహా గాయపడటంతో కీపర్ గా ఎంటర్ ఇచ్చిన పంత్ ఇప్పుడు సాహా నుండి ఆ స్థానాన్ని కూడా లాక్కున్నాడు. కానీ మొదట్లో ఆ అంచనాలను అందుకోలేక కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. కానీ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పొయ్యాడు. అయితే తాను కీపర్ కావడానికి కావడానికి కారణం మా నాన్న అని పంత్ పేర్కొన్నాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంత్ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటినుండి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అయితే నేను ఎప్పుడు కీపర్ గానే ఉండటానికి ఇష్టపడ్డాను. ఎందుకంటే మా నాన్న కూడా క్రికెట్ ఆడిన సమయంలో కీపర్ గానే ఉండేవారు. అందుకే నేను కూడా చిన్నప్పుడే కీపర్, బ్యాటర్ కావాలని కోరుకున్నాను అని పంత్ అన్నారు. అలాగే కీపర్ అనేవాడు క్రీజులో ఎప్పుడు చురుకుగా, యాక్టివ్ గా ఉండాలి. ఇన్నింగ్స్ లో మొదటి బంతి నుండి ఆఖరి బంతి వరకు అందుకునేలా ఉండాలి.
అలా ఉండాలి అంటే ఎప్పుడు మనం మన మైండ్ ను చాలా ఫ్రెష్ ఉంచుకోవాలి. అయితే నిరంతరం క్రికెట్ ఆడటం కారణంగా ఒత్తిడి అనేది వస్తుంది. కానీ దానిని ఎదుర్కోవడానికి మీరు మీ మనస్సును ఎప్పుడు ప్రశాంతగా ఉంచుకోవాలి. ఒకవేళ మీరు మీ ఒత్తిడిని గనుక జయించకపోతే మీరు మీ 100 శాతం ఇవ్వలేరు. అయితే నేను ఎలా కీపింగ్ చేస్తున్నాను.. ప్రతి మ్యాచ్ లో అది ఇంప్రూవ్ అవుతుందా అనేది నాకు తెలియదు. కానీ నేను ప్రతి మ్యాచ్ లో నా 100 ఇవ్వడానికే ప్రయత్నిస్తాను అని ప్యాంటు అన్నాడు.
ఇవి కూడా చదవండి :
చాహల్ మొదటి ప్రేమ గురించి భార్య ధనుశ్రీ కామెంట్స్..!
తల్లిదండ్రుల సపోర్ట్ తలచుకొని ఎమోషనల్ అయిన ఉమ్రాన్ మాలిక్..!
Advertisement