Home » టీడీపీ-జనసేన కూటమి పై హరిరామజోగయ్య సంచలన లేఖ.. అది వారి ఖర్మ..!

టీడీపీ-జనసేన కూటమి పై హరిరామజోగయ్య సంచలన లేఖ.. అది వారి ఖర్మ..!

by Anji
Ad

కాపుల సంక్షేమం కోసం పాటుపడే మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య జనసేన, టీడీపీ పొత్తుపై విసుగు చెందినట్టుగా అర్థమవుతోంది. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడాన్ని అంగీకరించని జోగయ్య ఇటివలి కాలంలో లేఖస్త్రాల సంఖ్యను రెట్టింపు చేశారు. కూటమిలో ప్రాధాన్యత, స్పష్టత రావాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేతకు ఆయన అనేక లేఖలో సలహాలు ఇస్తూ వస్తున్నారు. ఇకపై పొత్తు గురించి పవన్‌తో పాటు చంద్రబాబుకు సైతం సలహాలు ఇవ్వడం మానేయాలని హరిరామ జోగయ్య నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనకు, పార్టీకి అండగా నిలబడే వారే కావాలి తప్ప వేరే చోట కూర్చొని సలహాలు ఇచ్చే వారు కాదని పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హరిరామ జోగయ్య రాసిన లేఖ సంచలనం రేపుతోంది.

Advertisement

Advertisement

‘తెలుగుదేశం, జనసేన బాగు కోరి నేనిచ్చే సలహా అధినేతలు ఇద్దరికీ నచ్చినట్టు లేదు. అది వారి ఖర్మ. నేను చేయగలిగింది ఏమి లేదు’  అని జోగయ్య లేఖ రాయడం ఇప్పుడు కాక రేపుతోంది. వాస్తవానికి  కొన్ని రోజులుగా జోగయ్య పవన్‌పై చాలా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కాపులు సీఎంగా ఉండాలన్నదే జోగయ్య లక్ష్యం. అప్పుడే వారి కులం ముందుకు వెళ్తుందని ఆయన నమ్మకం. అదే కాపు కులానికి చెందిన పవన్‌ కేవలం 24 అసెంబ్లీ స్థానాల్లోనే పోటి చేస్తుండడం జోగయ్యకు నచ్చలేదు. పొత్తులో భాగంగా జనసేన 50-60 స్థానాల్లో పోటి చేయాలని ఆయన అనేకసార్లు బలంగ తన గళాన్ని వినిపించారు. అయితే జనసేనకు కేవలం 24 సీట్లే కేటాయిస్తుండడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Also Read : జగన్ ని పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు.. గర్జించిన జనసేనాని

Visitors Are Also Reading