Home » నవీన్ కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన హరిహార కృష్ణ ప్రియురాలు !

నవీన్ కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన హరిహార కృష్ణ ప్రియురాలు !

by Bunty
Ad

నవీన్ కేసులో రోజుకో షాకింగ్‌ నిజం బయటపడుతోంది. నవీన్‌ కేసులో ఇప్పటికే హరిహార కృష్ణ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా హరిహార కృష్ణ ప్రియురాలు నిహారికను మరియు అతని స్నేహితుడు హసన్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే, ఈ కేసులో హరిహార కృష్ణ ఏ1 గా, హసన్‌ ను ఏ2 గా అలాగే, నిహారికను ఏ3 గా పోలీసులు గుర్తించారు. అయితే, అయితే, నవీన్ హ*** కేసులో ఏ3 ముద్దాయిగా ఉన్న హరిహార కృష్ణ ప్రియురాలు నిహారిక, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించింది.

READ ALSO : Rishab Shetty: రాజకీయాల్లోకి “కాంతార” హీరో రిషబ్ శెట్టి…!

Advertisement

తాను నవీన్ ఇంటర్ నుంచే ప్రేమించుకున్నామని, తమ ఇంట్లోనే ఇద్దరం కలుసుకునే వాళ్ళమని చెప్పింది. నవీన్, తాను గొడవపడితే హరిహర కృష్ణ సర్ది చెప్పేవాడని, ఇద్దరి మధ్య తనే మధ్యవర్తిగా ఉండేవాడని వెల్లడించింది. తాను, నవీన్ విడిపోయాక, హరి తనను ప్రేమిస్తున్నానని చెప్పాడని వెల్లడించింది. అంతేకాక హరిహరకృష్ణ, తరచుగా నవీన్ ను చంపేసి, తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్తానని అనేవాడని, తాను మందలిస్తే, ఊరికే సరదాగా అన్నానని చెప్పేవాడని యువతి పోలీసులకు తెలిపింది.

Advertisement

READ ALSO : “రైటర్ పద్మభూషణ్” ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే !

అంతేకాక హరి, నవీన్ ను హ*** చేయడానికి వాడిన కత్తులు, రెండు గ్లాసులు తనకు చూపించాడని యువతి వెల్లడించింది. నవీన్ హ*** తర్వాత తను నాలుగుసార్లు హరిని కలిశానని తెలిపింది. హ*** విషయం గురించి తనకు తెలిసినా కావాలనే పోలీసులకు, ఫ్రెండ్స్ కు చెప్పలేదని వెల్లడించింది. ఈ కేసులో తాము దొరికే అవకాశం లేదని హరి తనతో చెప్పాడని, అతడి మాటలు నమ్మానని యువతి వెల్లడించింది. నవీన్ హ*** తర్వాత తాము వనస్థలిపురం ప్రాంతంలో మూడు సార్లు కలిశానని ఒప్పుకుంది. హ*** తర్వాత హరికి 1500 రూపాయలు ఇచ్చి పారిపోయేందుకు సహకరించానని యువతి అంగీకరించింది.

READ ALSO :  12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్

Visitors Are Also Reading