Home » నా ప్రదర్శన భారత జట్టులో స్థానం కోసం కాదు..!

నా ప్రదర్శన భారత జట్టులో స్థానం కోసం కాదు..!

by Azhar
Ad

భారత జట్టులో ఓ అద్భుతమైన ఆల్ రౌండర్ గా కపిల్ దేవ్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా పేరు సంపాదించుకున్న హార్దిక్ పాండ్య 2019 నుంచి సరైన ప్రదర్శన ఇవ్వలేకపొతున్నాడు. ఆ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న పాండ్య ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. బ్యాటింగ్ లో కొంచెం పర్వాలేదు అనిపిస్తున్నా.. బౌలింగ్ లో మాత్రం పూర్తిగా విఫలమవుతూ వచ్చాడు.

Advertisement

అయినా కూడా పాండ్యా కు బీసిసిఐ అవకాశం ఇస్తూనే వచ్చింది. ఇక గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ లో కూడా భారత జట్టు తరపున ఆడిన పాండ్య పూర్తిగా విఫలమవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత వరుసగా ఐదు నెలలు రెస్ట్ తీసుకొని ఫిట్నెస్పై దృష్టి సారించిన పాండ్య ఐపీఎల్ 2022 లో మాత్రం చెలరేగి పోతున్నాడు. గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న పాండ్య… నాయకుడి గానే కాకుండా బ్యాటర్ గా కూడా అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్నాడు.

Advertisement

ఈ క్రమంలో తాజాగా ఓ జర్నలిస్ట్ మీరు చేస్తున్న ఈ ఐపీఎల్ ప్రదర్శన మిమ్మల్ని తిరిగి భారత జట్టులోకి తీసుకవస్తుందా అని ప్రశ్నించగా.. .నేను ప్రస్తుతం టీమిండియా లోకి రావాలి అనే విషయం గురించి ఆలోచించడం లేదు. నా ప్రదర్శన కూడా అందుకోసం అని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా ఐపీఎల్ పైనే ఉంది అని పాండ్య పేర్కొన్నాడు. అయితే పాండ్య ఇలా చెప్పినా తనకు ప్రపంచకప్ జట్టులో బెర్త్ ఖాయం అని అభిమానులు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు.

ఇవి కూడా చదవండి :

సాహా చెప్పిందే నిజం.. మజుందార్ పై నిషేధం…!

ధోనిపైన నమ్మకం ఉంది.. కానీ..?

Visitors Are Also Reading