Home » పుష్ప సినిమా లో రష్మిక ఫ్రెండ్ గా నటించిన ఆ అమ్మాయి ఎవరో తెలుసా ?

పుష్ప సినిమా లో రష్మిక ఫ్రెండ్ గా నటించిన ఆ అమ్మాయి ఎవరో తెలుసా ?

by AJAY
Ad

టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా పుష్ప‌. ఈ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా సినిమాలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్ గా న‌టించింది. ఇక ఈ సినిమా కొంద‌రు ఇప్ప‌టికే గుర్తింపు తెచ్చుకున్న న‌టీన‌టులు ఉండ‌గా మ‌రి కొంద‌రు మాత్రం కొత్త‌వారిని తీసుకున్నారు.

pushpa-actor-anashvi

pushpa-actor-anashvi

అలా తీసుకున్న కొత్త‌వారు కూడా మొదటి సినిమాతోనే ఎంతో పేరు సంపాదించుకున్నారు. త‌మ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. అలా త‌మ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిచిన వారిలో ర‌ష్మిక‌కు ఫ్రెండ్ గా న‌టించిన అన‌ష్వి రెడ్డి కూడా ఒక‌రు.

Advertisement

ALSO READ : టీడీపీ నుండి అలీ అందుకే బ‌య‌ట‌కు వ‌చ్చేశారు..శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.!

pushpa anashvireddy

pushpa anashvireddy

పుష్ప సినిమాలో అన‌ష్వి రెడ్డి ప‌ర్ఫామెన్స్ కు ఆమె డైలాగుల‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. అల్లు అర్జున్ ర‌ష్మిక మ‌ధ్య జ‌రిగే బ్రిడ్జి పై సీన్ లో…. ఓన్నో నేనొచ్చి ఇచ్చేదా ముద్దు…..అనే డైలాగ్ మ‌రియు అల్లు అర్జున్ ర‌ష్మిక వ్యాన్ లో కూర్చున్న సీన్ లో టిఫిన్ డైలాగ్ బాగా పేలాయి. అలా మొద‌టి సినిమాకే గుర్తింపు తెచ్చుకున్న అన‌ష్వి రెడ్డి సొంత ఊరు తిరుప‌తి కాగా గ‌తంలో ఐటీ రంగంలో ఉద్యోగం చేసింది.

Advertisement

అన‌ష్విరెడ్డి తండ్రి వ్య‌వ‌సాయం తో పాటూ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. ఇక ఆమెకు ఇద్ద‌రు చెల్లెల్లు కూడా ఉన్నారు. అయితే మొద‌ట తాను సినిమాల్లోకి వెళ‌తానంటే త‌న త‌ల్లి ఒప్పుకోలేద‌ట‌. కానీ పుష్పలో అవ‌కాశం వ‌చ్చిన త‌ర‌వాత ఓకే చెప్పార‌ట‌. పుష్ప సినిమా ఆడిష‌న్ కు వెళ్లి వ‌చ్చిన త‌ర‌వాత త‌న‌కు అవకాశం వ‌స్తుంద‌ని అనుకోగా అనుకున్న‌ట్టుగానే జ‌రిగింద‌ని అన‌ష్వి చెప్పుకొచ్చింది.

ఇక ఈ సినిమా కోసం తానే ర‌ష్మిక‌కు చిత్తూరు స్లాంగ్ ను నేర్పించాన‌ని చెప్పింది. ర‌ష్మిక ఇత‌ర సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్న‌ప్పుడు ఆ షూటింగ్ స్పాట్ ల‌కు వెళ్లి కూడా స్లాంగ్ నేర్పించాన‌ని చెప్పింది. పుష్ప 2 లో తాను ఉంటానో లేదో తెలియ‌ద‌ని కానీ ర‌ష్మిక‌కు చిత్తూరు స్లాంగ్ నేర్పించ‌డానికి మాత్రం షూటింగ్ కు వెళ‌తాన‌ని తెలిపింది.

Visitors Are Also Reading