ఐపీఎల్ 2022 లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు టైటిల్ అందించిన కెప్టెన్ హార్దిక్ పాండ్య. 2019 ప్రపంచ కప్ తర్వాత వెన్నుముకకు చేసుకున్న ఆపరేషన్ కారణంగా ఫిట్నెస్ కోల్పోయిన పాండ్య అప్పటినుండి బౌలింగ్ చేయడం ఆపేసాడు. అలాగే బ్యాటింగ్ లో కూడా పెద్దగా మెరుపులు మెరిపించలేదు. అందులో ఇండియా జట్టులో స్థానం కోల్పోయాడు. కానీ ఇప్పుడు ఈ ఐపీఎల్ లో బౌన్స్ బ్యాక్ అయ్యి పాత పాండ్యను మళ్ళీ అందరికి గుర్తు చేసాడు.
Advertisement
ఇక తాజాగా పాండ్య మాట్లాడుతూ తన విజయం వెనుక ఉన్నది కేవలం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే అని పేర్కొన్నాడు. నేను ఈరోజు ఉండటానికి ధోని ఇచ్చిన నమ్మకాన్ని కారణం అని అన్నాడు. అయితే నేను 2016 ప్రపంచ కప్ ముందు కేవలం మూడు ఇంటర్నేషనల్ మ్యాచ్లు మాత్రమే ఆడాను. కానీ నన్ను ప్రపంచ కప్ కు ఎంపిక చేసినట్లు ధోని నాకు ముందుగానే చెప్పాడు. ఇక ఆ తర్వాత కూడా నాకు భరోసా ఇచ్చాడు. అయితే నేను నా మేధో మ్యాచ్ లో చాలా దారుణంగా విఫలమయ్యాను.
Advertisement
నేను వేసిన మొదటి ఓవర్ లోనే 21 పరుగులు సమర్పించుకున్నాను. అప్పుడు ఇదే మొదటి ఆఖరి ఓవర్ అని అనుకున్నాను. కానీ నేను ఈ ఓవర్ వేసింది ధోని కెప్టెన్సీలో కాబట్టి సరిపోయింది. ఎందుకంటే ఆ తర్వాత కూడా ధోని నాకు అండగా నిలిచాడు. నాపై నమ్మకం ఉంచాడు అని అన్నాడు. అదే విధంగా తాను భారత జట్టులో ఏ ఆటగాళ్లను చూస్తూ పెరిగానో వారితోనే కలిసి ఆడటం నాకు అప్పుడు చాలా సంతోషంగా ఆనిపించింది అని పాండ్య పేర్కొన్నాడు. ఇక ఈ ఐపీఎల్ 2022 లో పాండ్య తాను ఏంటో నిరూపించుకోవడంతో మళ్ళీ భారత జట్టులోకి వచ్చాడు. ఈ నెల 9న సూత్ ఆఫ్రికాతో జరిగే టీ20 సెస్ కు ఎంపిక చేసిన జట్టులో పాండ్య కూడా ఉన్న విషయం అందరికి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :