Home » భారత భవిష్యత్ కెప్టెన్ పాండ్యనే…!

భారత భవిష్యత్ కెప్టెన్ పాండ్యనే…!

by Azhar
Ad

విరాట్ కోహ్లీ టీం ఇండియా కెప్టెన్సీ నుండి తప్పుకున్న తర్వాత… ఆ స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ వచ్చాడు. కానీ రోహిత్ ను మూడు ఫార్మాట్లలో కెప్టెన్ చేయడం పై విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే… రోహిత్ వయస్సు ఇప్పుడు 35 సవత్సరాలు. కాబట్టి ఎకువలో ఎక్కువగా.. ఇంకా రెండు మూడేళ్లు రోహిత్ కెప్టెన్ గా ఉంటాడు. అలాగే రోహిత్ ఎక్కువగా గాయాలపాలవుతూ ఉంటాడు. అందుకే రోహిత్ కు కెప్టెన్సీ ఇవ్వకూడదని చాలా మంది మాజీలు అన్నారు. అయితే ఇప్పుడు ఇది మరి ఎక్కువైంది. అందుకు కారణం కోహ్లీ లాగే రోహిత్ కూడా కెప్టెన్సీ ఒత్తిడి వల్ల పరుగులు చేయలేకపోతున్నాడు. అందువల్ల రోహిత్ ను టీ20 కెప్టెన్సీ నుండి తప్పించాలని సెహ్వాగ్ కూడా కామెంట్స్ చేసాడు.

Advertisement

అయితే ఈ విషయంలో ఎక్కువ విమర్శలు వస్తుండటంతో తాజాగా ఓ బీసీసీఐ అధికారి క్లారిటీ ఇచ్చాడు. అదేంటంటే.. రోహిత్ ను ఇప్పుడే కెప్టెన్సీ నుండి తొలగించలేము అని చెప్పాడు. అలాగే రోహిత్ పైన వస్తున్న ఒత్తిడిని కూడా మేము చూసుకోవాలి. అందుకే అతను ఎప్పుడైనా ఎక్కువ క్రికెట్ ఆడుతుంటే… అతనికి విశ్రాంతి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో టీం ఇండియా కెప్టెన్ గా పాండ్య వ్యవరిస్తాడు అని చెప్పాడు. అయితే రోహిత్ తర్వాత కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్.. ఆ తర్వాత రిషబ్ పంత్ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ బీసీసీఐ అధికారి మాత్రం పాండ్యను కెప్టెన్ గా చేస్తాం అని అన్నాడు..

Advertisement

ఐపీఎల్ 2022 ముందు అసలు జట్టులోనే లేని పాండ్య.. అనూహ్యంగా ఇప్పుడు కెప్టెన్సీ రేసులో నిలిచాడు. అందుకు కారణం ఈ ఐపీఎల్ లో తన జట్టును నడిపించిన తీరు. ఈ ఏడాదే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. అందుకే పాండ్యను కెప్టెన్ చేయాలనీ చాలా మంది అన్నారు. ఇప్పుడు వారి వాదనలకు తగ్గట్లుగానే రోహిత్ లేకపోతే పాండ్యనే మా కెప్టెన్ అని ఆ అధికారి చెప్పారు. కానీ అది కేవలం టీ20 ఫార్మాట్ లో మాత్రమే అని ఆ క్లారిటీ ఇచ్చాడు. దాంతో ఇప్పుడు రాహుల్, పంత్ పరిస్థితి ఏంటి అని కూడా కొందరు అడుగుతుంటే.. ఇంకొందరు మరి వన్డే, టెస్ట్ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

సంజూ శాంసన్ కు ఎందుకు అన్యాయం జరుగుతుంది..?

రోహిత్ ను టీ20 కెప్టెన్ గా తప్పించాలి అంటున్న సెహ్వాగ్…!

Visitors Are Also Reading