రోహిత్ శర్మ న్యాయకత్వంలో ప్రధాన ఆటగాళ్లతో కూడిన ఒక్క భారత జట్టు అనేది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా.. ఆ తర్వాత కొన్ని రోజులకు హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో యువ ఆటగాళ్లతో కూడిన టీం ఇండియా ఒక్కటి ఐర్లాండ్ పర్యటనకు రెండు టీ20ల సిరీస్ కోసం వెళ్ళింది. అయితే ఈ రెండో టీం అనేది తమ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఐర్లాండ్ ను వాళ్ళ దేశంలోనే క్లిన్ స్వీప్ చేసింది. ఇక అక్కడి నుండి కొంత మంది ఆటగాళ్లు తిరిగి ఇండియాకు వస్తుంటే.. మరి కొందరు ఇంగ్లాండ్ కు వెళ్తారు. ఎందుకంటే.. ఇంగ్లాండ్ లో మొదట జరిగే రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్ తరువాత మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ అనేది జరుగుతుంది.
Advertisement
అయితే మొదట ఇంగ్లాండ్ కు వెళ్లిన భారత జట్టు టెస్ట్ మ్యాచ్ కోసం ఎంపిక చేయబడింది. ఇక ఈ పర్యటనలో భాగంగా జరుగుతున్న వార్మర్ మ్యాచ్ సమయంలో.. ఇండియా జట్టులో కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. అందువల్ల రేపటి నుండి ప్రారంభం కానున్న టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్ గా పేసర్ బుమ్రాను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే రేపటి నుండి ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అవుతున్న సమయంలోనే మన జట్టు అనేది ఇంగ్లాండ్ కౌంటీ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ అనేది ఆడాల్సి ఉంది. ఈ ఒక్క టెస్ట్ మ్యాచ్ జరిగే 5 రోజులోనే 2 వార్మప్ మ్యాచ్ లు పూర్తవుతాయి.
Advertisement
అయితే కరోనా బారిన పడిన రోహిత్ శర్మ.. వైట్ బల్ సిరీస్ లకు అందుబాటులోకి వస్తాడు. కానీ ఈ వార్మప్ మ్యాచ్ లకు మాత్రం ఉండడు. అందుకే.. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లలో కూడా.. ఐర్లాండ్ పర్యటనలో నాయకునిగా సక్సెస్ అయిన పాండ్యనే మన టీం ఇండియాకు కెప్టెన్సీ వహించబోతున్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ కు పాండ్య కెప్టెన్సీ వహించిన తీరుతో ఐర్లాండ్ పర్యటనలో అతనికి టీం ఇండియా కెప్టెన్సీ ఇచ్చింది బీసీసీఐ. ఇక ఈ పర్యటనలో కూడా పాండ్య సెలక్టర్లను మెప్పించడంతో.. ఇంగ్లాండ్ టూర్ లో కూడా అదే దారిలో వెళుతుంది. ఇకమీదట రోహిత్ అందుబాటులో లేని ప్రతిసారి కెప్టెన్ గా పాండ్యనే చేయాలనీ భావిస్తుంది బీసీసీఐ.
ఇవి కూడా చదవండి :