Home » కోహ్లీ ఇక మళ్ళీ ఎప్పటికి కెప్టెన్ కాడు..!

కోహ్లీ ఇక మళ్ళీ ఎప్పటికి కెప్టెన్ కాడు..!

by Azhar
Ad

విరాట్ కోహ్లీ.. భారత కెప్టెన్ గా మూడు ఫార్మట్స్ నుండి గత ఏడాది తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే టీ20, టెస్టులో కోహ్లీ స్వతహాగా నాయకునిగా తప్పుకోగా.. వన్డేలో మాత్రం వైట్ బాల్ ఫార్మాట్ కు ఇద్దరు కెప్టెన్లు వద్దు అని బీసీసీఐ తప్పించి.. ఆ మూడు ఫార్మాట్ల బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది. ఇక రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని అందరూ భావించారు. అలానే జరిగింది కూడా. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీం ఇండియా.. రోహిత్ కెప్టెన్సీలో మొదట ఏశ్ట్ మ్యాచ్ ఆడాల్సింది. కానీ రోహిత్ కు కరోనా రావడంతో.. ఈ మ్యాచ్ కు హిట్ మ్యాన్ దూరం అయ్యాడు.

Advertisement

ఆ తర్వాత ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న మొదలయ్యింది. అయితే చాలా మంది విరాట్ కోహ్లీ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరరించాలని సోషల్ మీడియాలో కోరుతున్నారు. ఎందుకంటే.. ఇది గత ఏడాది వాయిదా పడ్డ మ్యాచ్.. అప్పుడు ఈ సిరీస్ లో కెప్టెన్ గా కోహ్లీనే ఉన్నాడు కాబట్టి.. ఈ ఆఖరి మ్యాచ్ లో కూడా కోహ్లీనే కెప్టెన్సీ వహించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ విరాట్ కోహ్లీ మళ్ళీ ఎప్పటికి కెప్టెన్ కాడు అని.. కోహ్లీ చిన్ననాటి కోచ్.. రాజ్ కుమార్ శర్మ అన్నారు.

Advertisement

తాజాగా రాజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీని టెస్టు కెప్టెన్సీ నుండి బీసీసీఐ తీసేయలేదు. అతనే స్వయంగా తప్పుకున్నాడు. అందువల్ల మళ్ళీ ఇక్కడ కెప్టెన్ గా కోహ్లీ బాధ్యతలను స్వీకరించడు అని తెలిపారు. కానీ ఈ విషయంలో బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఎందుకంటే.. కోహ్లీ మళ్ళీ కెప్టెన్సీ కావాలని అడగడు. కానీ అతను ఎప్పుడు జట్టు మంచి కోసం మాత్రమే ఆలోచిస్తాడు. అందువల్ల ఒకవేళ బీసీసీఐ స్వయంగా కోహ్లీని కెప్టెన్సీ తీసుకోవాలని కోరితే.. మాత్రం అప్పుడు కోహ్లీ ఏం చేస్తాడు అనేది మాత్రం తెలియదు అని రాజ్ కుమార్ శర్మ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐని లెక్క చెయ్యని టీం ఇండియా.. విచ్చలవిడిగా..?

ఇంగ్లాండ్ క్రికెటర్ తో సచిన్ కొడుకి ప్రేమాయణం..!

Visitors Are Also Reading