ఐపీఎల్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. గెలుస్తాయి అనుకున్న జట్టు ఓడిపోతూ, ఓడిపోతాయి అనుకున్న జట్లు గెలుస్తూ ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను పంచుతోంది ఈసారి ఐపీఎల్. ఇది ఇలా ఉండగా, ఇండియా మాజీ సారధి ధోని గురించి తెలియని వారు ఉండరు. ధోని నాయకత్వంలో జట్టు చాలా రోజులుగా ఊరిస్తున్న వన్డే ప్రపంచ కప్ తో పాటు టి20 వరల్డ్ కప్ ను కూడా ఒడిసిపట్టింది. టెస్టుల్లోను నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది.
READ ALSO : ప్రభాస్ సొంత అన్న సినిమాల్లోకి ఎందుకు రాలేదు.. అసలు ఆయన ఏం చేస్తారు !
Advertisement
అయితే 2019 ప్రపంచ కప్ ఓటమి తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ కు మహి గుడ్ బై చెప్పేసాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడనప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అభిమానులకు వినోదాన్ని పంచుతూనే ఉన్నాడు. కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ ను ముందుండి నడిపిస్తూనే, హిట్టర్ గా విద్యార్థులకు విజయాలను చేకూరుస్తున్నాడు. అయితే వయసు పెరుగుతున్న నేపథ్యంలో అతడి ఐపిఎల్ రిటైర్మెంట్ మీద కూడా చర్చ మొదలైంది. ఐపీఎల్ కు ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడో ధోని స్పష్టంగా చెప్పలేదు. అయితే ఎప్పుడు కూల్ గా ఉండే ధోని ప్రశాంతతను కోల్పోయి బ్యాట్ విరగ్గొట్టాడట.
Advertisement
Also Read: దసరా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ స్థానంలో సాయి పల్లవి నటిస్తే ఎలా ఉండేదో తెలుసా ?
ఈ విషయాన్ని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. వీరిద్దరూ చాలా కాలం పాటు కలిసి భారత జట్టుకు ఆడిన విషయం విధితమే. ఝార్ఖండ్ లో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా ధోని తన బ్యాట్ ను విరగ్గొట్టినట్లు భజ్జి తెలిపాడు. జార్ఖండ్ లో మేము రెండు జట్లుగా విడిపోయి ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడుతున్నాం. ఈ మ్యాచ్ లో ధోని జట్టు చాలా వెనకబడింది. ధోని ఆఖరిలో బ్యాటింగ్ వచ్చాడు. ఈ క్రమంలో తన జట్టు వెనకబడడంతో ధోని కోపంతో ఊగిపోయాడు. తన బ్యాట్ ని నేలకేసి కొట్టాడు. దీంతో బ్యాట్ హ్యాండిల్ విరిగిపోయింది అని సిఎస్కే, కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా హర్భజన్ పేర్కొన్నాడు.
READ ALSO : Maama Mascheendra : దుమ్ము లేపుతున్న ‘మామా మశ్చీంద్ర’ టీజర్