Happy Dussehra 2023: సాధారణంగా హిందువులు దసరా లేదా విజయదశమిని పెద్ద పండుగగా భావిస్తుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు, విజయదశమి ఉత్సవాలు జరుపుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. పదో రోజును విజయదశమి అంటారు. ముఖ్యంగా శక్తి ఆరాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
Find also: Top and Best Motivational Quotes in Telugu To Share
Advertisement
దేవీ నవరాత్రి శరన్నవరాత్రి అంటారు. శరద్ రుతువు ప్రారంభంలో వచ్చే పండుగ కాబట్టి ఈ పండుగకు శరన్నవరాత్రి అని పేరు వచ్చింది. బొమ్మల కొలువు పెట్టడం ఓ ఆనవాయితీ.. ఆలయాల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదోరోజు విజయదశమి జరుపుకోవడం.. దుర్గ పూజ చేస్తుంటారు. అమవాస్య రోజు నుంచి నవమి వరకు తెలంగాణలో బతుకమ్మ ఆడుతారు. తెలంగాణలో అమవాస్య రోజు స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ.
దసరా శుభాకాంక్షలు ఇలా చెప్పండి
Advertisement
- దసరా సందర్భంగా రాముడు మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయాన్ని నింపాలని ప్రార్థిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు!
- మీలోని రాక్షసుడు ఎల్లప్పుడూ ఓడిపోతాడు, దైవం మీ ఆలోచనలను ఎప్పటికీ నియంత్రిస్తుంది. దసరా శుభాకాంక్షలు!
- దుర్గాదేవి మీ కోరికలన్నీ తీర్చి, మీకు మంచి ఆరోగ్యం, విజయం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ.. విజయదశమి శుభాకాంక్షలు!
- దసరా సందర్భంగా రావణుడి దిష్టిబొమ్మతో పాటు మీలో ఉన్న అహం, ద్వేషం, కోపాలను కాల్చండి!
- రాముడు మీ విజయానికి మార్గాన్ని చూపే వెలుగును ఇస్తూనే ఉంటాడు. మీరు జీవితంలోని ప్రతి దశలోనూ విజయం సాధిస్తారు. జై శ్రీ రామ్. దసరా శుభాకాంక్షలు.
- రాముడు భూమిపై చెడును నాశనం చేసినట్లే, మీరు కూడా మీ మనసు నుంచి అన్ని ప్రతికూల ఆలోచనలను విజయవంతంగా దూరం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ దసరా!
- ఈ దసరా సందర్భంగా ధర్మ మార్గాన్ని అనుసరించడానికి శ్రీరాముడు మీకు శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ.. హ్యాపీ విజయదశమి.
Best Dussehra Images in Telugu 2023