Home » Happy Dasara Wishes 2022: దసరా విషెస్, కోట్స్, దసరా పండుగ శుభాకాంక్షలు 2022

Happy Dasara Wishes 2022: దసరా విషెస్, కోట్స్, దసరా పండుగ శుభాకాంక్షలు 2022

by Anji
Ad

Happy Dusshera/ Dasara 2022 : దేశ‌వ్యాప్తంగా ద‌స‌రా పండుగను అంగ‌రంగ‌వైభ‌వంగా నిర్వ‌హించుకుంటారు. ఒక్కోప్రాంతంలో ఒక్కోవిధంగా ద‌స‌రా పండుగ‌ను జ‌రుపుకుంటారు. తెలంగాణ‌లో చాలా ముఖ్యమైన పండుగ‌. ప్ర‌ధానంగా తెలంగాణ‌లో అయితే ఆశ్వ‌యుజ అమ‌వాస్య రోజు బ‌తుక‌మ్మ పండుగ నిర్వ‌హిస్తారు. అమ‌వాస్య రోజు ఎంగిలిపూల బ‌తుక‌మ్మ‌గా ప్రారంభమ‌య్యే సంబరాలు 9 రోజుల పాటు సాగి స‌ద్దుల బ‌తుక‌మ్మ రోజు గౌర‌మ్మ‌ను సాగ‌నంప‌డంతో బ‌తుక‌మ్మ పండుగ ముగుస్తుంది. ఇక ఈ 9 రోజుల పాటు మ‌హిళ‌లు చేసే హ‌డావిడి మామూలుగా ఉండ‌దు. తొలి రోజు ఎంగిలి పూల బ‌తుక‌మ్మ‌, 2వ రోజు అటుకుల బతుక‌మ్మ‌, 3వ రోజు ముద్ద‌ప‌ప్పు బ‌తుక‌మ్మ‌, 4వ రోజు నాన‌బియ్యం, 5వ అట్ల బ‌తుక‌మ్మ‌, 6వ రోజు అలిగిన బ‌తుక‌మ్మ లేదా అర్రెం, 7వ రోజు వేప‌కాయ‌ల బ‌తుక‌మ్మ, 8వ రోజు వెన్న ముద్ద‌ల బ‌తుక‌మ్మ‌, 9వరోజు స‌ద్దుల బ‌తుక‌మ్మ‌గా ఉత్స‌వాలు జ‌రుపుకుంటారు.

Dasara 2022: దసరా పండుగ ఎలా వచ్చింది

 

happy dasara wishes images 2022 telugu

happy dasara wishes images 2022 telugu

ప్ర‌కృతిలో ల‌భించే ప్ర‌తీ పువ్వు ఏరికోరి తెచ్చి, రంగు రంగుల పూల‌తో బ‌తుక‌మ్మ‌ల‌ను పేర్చి నిత్యం గౌరిదేవిని త‌మ ఆట‌పాట‌ల‌తో పూజిస్తుంటారు. అంద‌రూ క‌లిసి సంతోషంగా పాటలు పాడుతూ, బ‌తుక‌మ్మ ఆడుతుంటారు. ఎంగిలిపూల బతుక‌మ్మ‌తో వేడుక‌లు ప్రారంభ‌మై స‌ద్దుల బ‌తుమ్మ‌తో ముగుస్తాయి. పితృ అమ‌వాస్య రోజు పెద్ద‌ల‌ను పూజించుకుంటూ అదే స‌మ‌యంలో బ‌తుక‌మ్మ‌ల‌ను పేర్చి మ‌హిళ‌లు సంబరాలు జ‌రుపుకుంటారు. ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్య‌మి నుంచి ఆశ్వ‌యుజ శుద్ధ న‌వమి వ‌ర‌కు 9 రోజులు దేవీ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు జ‌రిపి ప‌ద‌వ రోజును విజ‌య దశ‌మి లేదా దస‌రా అని పిలుస్తుంటారు. ముఖ్యంగా ఈ పండుగ శ‌క్తి ఆరాధ‌న‌కు ప్రాధాన్య‌త‌ను ఇస్తుంద‌ని న‌మ్ముతుంటారు. శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు జ‌రుపుతుంటారు. శ‌ర‌దృతువు ప్రారంభంలో న‌వ‌రాత్రి ఉత్స‌వాలు నిర్వ‌హించ‌డంతో శ‌ర‌న్న‌వ‌రాత్రి అని పిలుస్తుంటారు.

Advertisement

dasara images 2022

Dusshera 2022: దసరా గురించి తెలుగులో

Advertisement

ముఖ్యంగా ఈ ఏడాది తెలంగాణ‌లో న‌వ‌రాత్రి ఉత్స‌వాలు సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్నాయి. అమ్మ‌వారు మొత్తం 9 రూపాల‌లో ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. బాల త్రిపుర సుంద‌రి దేవి, గాయ‌త్రి దేవి, మ‌హాల‌క్ష్మి దేవి, అన్న‌పూర్ణ దేవి, ల‌లిత త్రిపుర సుంద‌రి దేవి, మ‌హా స‌రస్వ‌తి దేవి, మ‌హిషాసుర వ‌ర్దిని, రాజ‌రాజేశ్వ‌రి దేవి అలంక‌ర‌ణ‌తో దుర్గ‌మాత అమ్మ‌వారిని కొలువ‌నున్నారు. ఇక విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను స్వ‌ర్ణ‌క వ‌చాలంకృత దుర్గాదేవి, బాలా త్రిపుర సుంద‌రి దేవి, గాయ‌త్రీ దేవి, అన్న‌పూర్ణ‌దేవి, ల‌లితా త్రిపుర సుంద‌రి దేవి, మ‌హాల‌క్ష్మిదేవి, స‌రస్వ‌తి దేవి, దుర్గాదేవి, మ‌హిషాసుర‌ర్దినిదేవి, రాజ‌రాజేశ్వ‌రి దేవి అవ‌తారాల్లో అమ్మ‌వారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

Also Read :  ఎరుపు, తెలుపు రంగు జామ పండ్ల‌లో ఏది మంచిది.. నిపుణులు ఏమ‌న్నారంటే..?

happy dasara wishes images 2022 telugu

happy dasara wishes images 2022 telugu

Dusshera, Dasara: దసరా 2022 పండుగ ఎప్పుడు

విజ‌య‌ద‌శ‌మి రోజున చ‌రిత్ర ప్ర‌కారం రాముడు రావ‌ణునిపై గెలిచిన సంద‌ర్భ‌మే కాకుండా పాండ‌వులు వ‌న‌వాసం వెళ్లి జ‌మ్మిచెట్టు పై త‌మ ఆయుధాల‌ను తిరిగి తీసిన రోజు కావ‌డంతో రావ‌ణ వ‌ధ‌, జ‌మ్మి ఆకుల పూజా చేయడం ఆన‌వాయితి. జ‌గ‌న్మాత దుర్గాదేవి, మ‌హిషాసురుడిని రాక్ష‌సునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అత‌న్ని వ‌ధించి జ‌యాన్ని పొందిన సంద‌ర్భంగా 10వ రోజు ప్ర‌జ‌లంద‌రూ సంతోషంగా పండుగ‌ను జ‌రుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ 05న విజ‌య‌ద‌శ‌మి.

Happy Dasara 2022 Wishes, Quotes, Greetings, Status Telugu

  1. అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి ! ఆకలి కొన్నవారి కడుపు నింపే అన్నపూర్ణ లాలించి పాలించే భ్రమరాంబ తప్పు చేస్తే దండించే దుర్గ మహిషాసురులని మర్దించే మహంకాళి అమ్మలగన్న యమ్మ ,మేటి పెద్దమ్మ , ముగ్గురమ్మల మూలపుటమ్మ మనలందరినీ తన ఒడిలో పెట్టుకు కాపాడాలని, మనకన్నిటా విజయాల్ని ప్రసాదించాలని కోరుతూ… మీకు,మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
  2. శుభప్రదమైన విజయదశమి రోజున మీ అందరికీ సుఖశాంతులు, ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ… దుర్గామాత ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ…విజయ దశమి శుభాకాంక్షలు
  3. అసత్యంపై సత్యం సాధించిన విజయం , ….అధర్మంపై ధర్మ సాధించిన విజయం ..అధైర్యంపై ధైర్యం సాధించిన విజయం అందుకే మనకు ఇది ముఖ్యమైన రోజు మీకు మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు.
  4. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధక, శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే….మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
  5. ఓం సర్వరూపే సర్వేశే సర్వశక్తి సమున్నతే.. భయేభ్యసాహి నో దేవి. దుర్గాదేవి నమోస్తుతే.. దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ…దసరా శుభాకాంక్షలు.

Also Read :  ఫ్రిజ్‌లో పండ్లు, కూర‌గాయ‌ల‌ను పెడుతున్నారా..? అయితే ఈ విష‌యాలు త‌ప్ప‌కుండా తెలుసుకోండి..!

Visitors Are Also Reading