టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రకరకాల పాత్రల్లో నటిస్తుంటారు హీరోలు. ముఖ్యంగా ప్రయోగాలు అన్ని సందర్భాల్లో అంతగా సూట్ అవ్వవు. కొన్ని సందర్భాల్లో చాలా అద్భతుంగా సక్సెస్ సాధిస్తారు. అలా చాలా సినిమాల విషయంలో జరిగింది. ఇక ముందు ముందు కూడా జరుగబోతుందనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కిన లీడర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ని సాధింలేదనే సంగతి తెలిసిందే. చాలా మంది ప్రేక్షకులకు మూవీ నచ్చినా కథ, కథనంలో లోపాలు ఈ మూవీకి మైనస్ అయ్యాయి. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Advertisement
ముఖ్యంగా రానా నటించిన లీడర్ మూవీ సక్సెస్ సాధించకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. మార్తాండ్ కె.వెంకటేష్ మాట్లాడుతూ.. ఆంధ్రావాలా మూవీలో ఎన్టీఆర్ మరో రోల్ కి హరికృష్ణను తీసుకుంటే ఆ సినిమా సక్సెస్ సాధించేదని అభిప్రాయపడ్డారు. పూరిజగన్నాథ్ మూవీకి ఏం అవసరమో ఆ సీన్లు మాత్రమే తెరకెెక్కిస్తారని అభిప్రాయపడ్డారు. పూరిజగన్నాథ్, శేఖర్ కమ్ముల వర్క్ విషయంలో ఎంతో స్వేచ్ఛ ఇస్తారని.. మార్తాండ్ కె వెంకటేష్ తెలిపారు. గీతా ఆర్ట్స్ నిర్మాతలు కథలు నచ్చితెనే నిర్మిస్తారని ఆయన తెలిపారు. లీడర్ పొలిటికల్ గా మంచి మూవీ అవుతుందని భావించామని సినిమాకి అనుకున్నంత రీచ్ కాలేదని మార్తాండ్ కె.వెంకటేష్ పేర్కొన్నారు.
Advertisement
టీవీలలో మాత్రం ఆ మూవీ హిట్ అయిందని మార్తాండ్ కె వెంకటేష్ తెలిపారు. నేనున్నాను మూవీ హిట్ కాదనుకున్నా. సక్సెస్ సాధించిందని వెల్లడించారు. దూసుకెళ్తా సినిమాకి థియేటర్లలో కంటే టీవీల్లో హిట్ అయిందని మార్తాండ్ కె. వెంకటేష్ అన్నారు. సూపర్ మూవీలో నాగార్జున లుక్ అలా ఉండటంతో తనకు నచ్చలేదని.. సినిమా రంగంలో ఈగోలు ఉంటాయని సర్దుకొని పోవాలని ఆయన వెల్లడించారు. ఆడియో ఫంక్షన్లలో టెక్నిషియన్లను పట్టించుకోరని.. అందుకే తాను వెళ్లనని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఎడిట్ సూట్ లో సీన్లు, ఫైట్స్ కట్ చేయిస్తారని వెల్లడించారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడానికి నాగార్జున సలహానే కారణమా?
Bigg Boss 7 నుంచి రతిక ఔట్.. అయినా గట్టిగా రెమ్యునరేషన్.. ఎన్ని లక్షలు అంటే ?