Home » గురూజీ మామూలోడు కాదమ్మా ‘గుంటూరు కారం’ సినిమా ఆ నవల ఆధారంగా తీసారా ?

గురూజీ మామూలోడు కాదమ్మా ‘గుంటూరు కారం’ సినిమా ఆ నవల ఆధారంగా తీసారా ?

by Srilakshmi Bharathi
Ad

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమా కథలతో ప్రేక్షకులపై ప్రభావం చూపించడం కొత్తేమీ కాదు. తనదైన శైలిలో మాటలు, ప్రాసలతో కూడిన డైలాగ్స్ తో ప్రేక్షకులను మాయ చేసే సత్తా ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందుకే ఆయన సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వస్తున్నా సినిమా “గుంటూరు కారం”. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

అయితే.. పరిశ్రమలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి సాహిత్య రచన ‘కీర్తి కిరీటాలు’ నుంచి త్రివిక్రమ్ స్ఫూర్తి పొంది ‘గుంటూరు కారం’ కథని రూపొందించారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. యద్దనపూడి నవలలు వాటి గొప్ప కథనాలకు, టఫ్ క్యారెక్టర్స్ కి పెట్టింది పేరు అన్న సంగతి తెలిసిందే. ‘కీర్తి కిరీటాలు’ యద్దనపూడి యొక్క ప్రశంసలు పొందిన నవలలలో ఒకటి. ఇది చాలా గుర్తింపు పొందినది.

Advertisement

సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి కలిగినవాడిగా పేరుగాంచిన త్రివిక్రమ్, ‘గుంటూరుకారం’ సినిమా కోసం ఈ నవల నుంచి స్ఫూర్తి పొందారని తెలుస్తోంది. ఈ రూమర్స్ అన్ని నిజమే అయితే.. ‘గుంటూరు కారం’ త్రివిక్రమ్ యొక్క ప్రత్యేకమైన దర్శకత్వ శైలితో యద్దనపూడి కథా సాహిత్యం రెండు కలగలిపి ఈ సినిమా ఓ మాస్టర్ పీస్ అవుతుందని చెప్పొచ్చు. ఈ నవలలో చెప్పబడ్డ సూక్షమైన అంశాలను మాటల మంత్రగాడు త్రివిక్రమ్ ఎలా తెరపై చూపిస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. గుంటూరు కారణం సంక్రాంతి సందర్భంగా పన్నెండు జనవరిన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటించారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading