పెళ్లి పేరుతో జరిగే మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రోజుల్లో చాలా మనం చూస్తున్నాము. గుంటూరు జిల్లా పరిధిలో ఒక ఘటన తాజాగా చోటుచేసుకుంది. వివరాలను చూస్తే… గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు బీటెక్ పూర్తి చేసి, మోటో కంట్రోలర్ మెకానిక్ గా పని చేస్తున్నారు. ఆయన తండ్రి పోలియో సమస్యతో బాధపడుతున్నారు. తల్లి కూడా అనారోగ్యంతోనే బాధపడుతున్నారు. అందుకే పెళ్లి చేయాలని అనుకున్నారు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లోని రిటైర్డ్ ఎంప్లాయ్ ద్వారా ఒక సంబంధం వచ్చింది. ఇరు కుటుంబాలకి నచ్చడంతో ఎలాంటి కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు.
Advertisement
Advertisement
రెండు లక్షలు పెట్టి బంగారం చేయించాడు. బంధువుల సమక్షంలో ఆరు లక్షలు పెట్టి ఊర్లోనే ఘనంగా రిసెప్షన్ చేయించారు. అయితే పెళ్లి తర్వాత ఏదో ఒక కారణం చెప్పి అతన్ని దూరం పెట్టేది ఆమె. తన తల్లికి ఆరోగ్యం బాలేదని ఇంటికి వెళ్లి, రెండు మూడు నెలలు అయినా సరే తిరిగి రాలేదు. అతను ఎందుకు రాలేదని ఆరా తీస్తే.. అసలు విషయం తెలిసింది. ఆమెకి ఇదివరకు ఒక అతనితో పెళ్లి అయినట్లు తెలిసింది. ఆమె మోసం చేసిందని పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
- తిరుమల శ్రీవారి హుండీలో చోరీ.. రూ.500 కి.. కోర్టు వేసిన శిక్ష ఇదే..!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు
- పెళ్లి చేసుకోబోతున్న కృతిశెట్టి-వైష్ణవ్ తేజ్.. ఇది వాస్తవమేనా ?