Home » నేడే జీఎస్ఎల్వీ ఎఫ్-14 ప్రయోగం

నేడే జీఎస్ఎల్వీ ఎఫ్-14 ప్రయోగం

by Anji
Ad

ఇస్రో షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. దీని కోసం శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటల నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. రాకెట్ ప్రయోగానికి మొత్తం 27.30 గంటల కౌంట్‌డౌన్‌ చేయనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. దీని తర్వాత జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ నింగిలోకి ప్రయాణించనుంది. ఈ రాకెట్‌లో 2,272 కిలోల బరువు కలిగిన ఇన్‌శాట్‌-3 డీఎస్‌ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలో మీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

Advertisement

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం షార్‌ కేంద్రం నుంచి ఇది 92వ ప్రయోగం. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 16వది. ఇప్పుడు ప్రవేశపెడుతున్న ఉపగ్రహం ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైనది. ఇక్కడే క్రయోజనిక్‌ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10 వ ప్రయోగం జీఎస్ఎల్వీ ఎఫ్-14 అని తెలిపారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు శ్రీహరికోట నుంచి GSLV-F14/INSAT 3DS మిషన్ ను ఇస్రో అంతరిక్షంలోకి పంపుతోంది. ఈ వ్యోమనౌక వాతావరణ శాటిలైట్ INSAT-3DS ని జియోసింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. GSLV మూడు దశల ప్రయోగించబడుతుంది. 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువు ఉంటుంది. ఇది ద్రవ ఆక్సిజన్, ద్రవ హైడ్రోజన్ ఉపయోగించి క్రయోజెనిక్ దశతో ఘన, ద్రవ చోదక దశలను కలిగి ఉంటుంది.

Also Read : పేటీఎంకు కాస్త ఊరటనిచ్చిన ఆర్బీఐ.. ఆంక్షలు సడలింపు..!

Visitors Are Also Reading