నిన్న జరిగిన గృహలక్ష్మి ఎపిసోడ్‌లో తులసి వద్దకు నందు వచ్చి దివ్య తల్లిదండ్రుల గురించి మాట్లాడాడు. దివ్య చదువు బాధ్యత తనది అని.. మీకు సంబంధం లేదని తులసి తిట్టి పంపించడం.. దివ్య అమ్మ వద్ద ఉంటున్నాను అమ్మ మాటనే వింటాను సారీ డాడ్ అనడంతో నందు అవమానంగా భావించి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక ఇవాళ అనగా ఏప్రిల్ 20 ఎపిసోడ్‌లో దివ్య ఇంట్లో జరిగిన దాని గురించి తలచుకుంటూ బాధపడుతుండగా.. తులసి వచ్చి ఓదార్చుతుంది. నీ సంతోషం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు దివ్య అని.. నేను ఫోన్ చేసి ఆయనను రమ్మంటాను. రాజీ పడుతాను. మా పంతాలు పిల్లల ఇష్టాలకు అసలు అడ్డు పడకూడదు. నా యొక్క జీవితం ఎలాగో నాకు కాకుండా పోయింది. నా వల్ల ఎవరూ బాధపడకూడదు. మీ డాడీకి ఇప్పుడే ఫోన్ చేసి క్షమాపణ చెబుతాను. అదేవిధంగా పేరెంట్స్ మీటింగ్ కు కూడా రమ్మని చెబుతానని ఫోన్ తీయబోతుంది.
ఆ విధంగా తులసి నందుకు ఫోన్ చేస్తుండగా.. ఆగు అమ్మా.. ఆత్మాభిమానం అన్నట్టుగా దివ్య అడ్డు పడుతుంది. నీకు నీ ఆత్మాభిమానం ఎంత ముఖ్యమో.. నాకు కూడా నీ ఆత్మాభిమానం అంతే ముఖ్యం. అన్నింటికి రాజీపడి తలవంచి నీ జీవతాన్ని నాశనం చేసుకున్నావు. ఇప్పుడిప్పుడే నీ తప్పు తెలుసుకొని సరైన దారిలో నడుస్తున్నావు. అందరూ నీ వైపు తలెత్తి చూసే విధంగా చేస్తున్నావు. నువ్వు ఇదివరకు తులసి మాదిరిగా మారకూడదు. డాడీకి ఎందుకు సారీ చెప్పడానికి సిద్ధమయ్యావు. నాకు రాజీపడే అమ్మకన్నా ఆత్మాభిమానం కోసం నిలబడే అమ్మ అంటేనే ఇష్టం. డాడీ అంటే నాకు ఇష్టమే కానీ నీతో బిహేవ్ చేసే విధానం నాకు అసలు నచ్చను. నీకంటే ఏవిషయంలో గొప్ప అని నీకు అన్యాయం చేసి లాస్య ఆంటిని పెళ్లి చేసుకున్నారు అని దివ్య డైలాగ్‌లు చెబుతుంది.
Advertisement
సువర్ణవకాశం కోసం ఎదురు చూస్తున్నప్రేమ్‌కి పాట రాసే అవకాశం రావడంతో ఎంతో ఇష్టంగా కష్టపడి పాటరాసి సంగీత దర్శకునికి చూపిస్తాడు. ఆ పాట చూసిన సంగీత దర్శకుడు ఊహించని విధంగా రియాక్ట్ అవుతాడు. సీతారామశాస్త్రి బతికి ఉంటే సాహిత్యాన్ని ఇంత ఖూనీ చేస్తావా..? నీ పీక పిసికి చంపేసేవారు అన్నారు. నీ మాట విని పెద్ద పోటుగాడివి అనుకుని పాట అదరగొడతావ్.. బెదరగొడతావ్ అనుకున్నా.. ఇంత చెత్త లిరిక్ నా జీవితంలో ఎప్పుడూ చదవలేదంటూ బండబూతులు తిట్లూ నలిపి డస్ట్ బిన్‌లో పడేస్తాడు. పాట రాయడం నీ స్థాయి కాదు.. పోయి కాఫీ తీసుకుని రా అంటూ తిట్టి అక్కడ నుంచి ప్రేమ్‌ను పంపించేస్తాడు. ప్రేమ్ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు. ప్రేమ్ అలా వెళ్లాడో లేదో.. ఆ సంగీత దర్శకుడు డస్ట్‌బిన్‌లో పడేసిన పేపర్‌ను తీసి ఈ ప్రేమ్ గాడిని ఏదో అనుకున్నాను కానీ.. చాలా బాగా రాశాడు. వేల సాంగ్స్ ట్యూన్ చేసాను కానీ.. ఇలాంటి పాటను చూడలేదు. ఇందులో కొన్ని పదాలను మార్చి నేనే రాసినట్టు ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లాగేస్తానని వంకరబుద్ధి చూపిస్తాడు సంగీత దర్శకుడు బప్పిల్ హరి.
Advertisement
అతని మాటలను తులసి వినేయడం చూసి షాక్ అవుతాడు. తులసి ఏమి మాట్లాడకుండా దగ్గరకు వచ్చి నువ్వు సరిగ్గా భోజనం చేయలేదని, ఖాళీ కడుపుతో ఉండవద్దు. అందుకే పాలు తీసుకుని వచ్చాను. తాగు నాన్న అంటూ పాల గ్లాస్ కొడుక్కి ఇస్తుంది. తులసి ఏం మాట్లాడకపోయే సరికి.. అందేంటి అమ్మా మౌనంగా ఉన్నావు ఏదైనా మాట్లాడు అని అభి అంటాడు. ఆ మాటతో తులసి నా మౌనం ఒక అనురాగం, ఒక అనుబధం, అది ఆయుధం కాదురా నిన్ను ఇబ్బంది పెట్టడానికి అని సింగిల్ డైలాగ్ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోబోతుంది. అదికాదు మమ్మీ.. నేను నా ఫ్రెండ్‌తో ఫోన్ మాట్లాడింది విన్నావా..? అని అడుగుతాడు. నవ్వుతూ వినలేదని తులసి చెప్పడంతో అభి ఊపిరి పీల్చుకుంటాడు.
మరొక వైపు సంగీత దర్శకుడు తన పాటను చింపి డస్ట్ బిన్‌లో పడేయడం ఘోరంగా అవమానించాడు అని తలచుకుని ప్రేమ్ రగిలిపోతుంటాడు. మామిడి కొమ్మకు చెతి గుచ్చుకుని గాయం అవుతుంది. అది చూసిన శృతి ఏమిటి ప్రేమ్ నీకు పిచ్చి నీకు పిచ్చి పట్టిందా..? అని కంగారు పడుతుంది. చేతికి పసుపు కట్టి ప్రేమ్‌ని ఓదార్చడం ప్రారంభించింది. నీ పాట నచ్చలేదన్నాడంటే వాడి కర్మ మంచి పాటను వదులుకున్నందుకు వాడు బాధపడాలని సర్ది చెప్పింది. పాట బాగాలేదని చెప్పినా పర్లేదు కానీ.. పాటను నలిపి డస్ట్‌బిన్‌లో పడేశాడని ప్రేమ్ బాధపడ్డాడు. ఏదో ఒకరోజు నాకు సమయం వస్తుంది. అప్పుడు చెబుతా వాడి పని అని అంటాడు. కరెక్ట్ చెప్పావు ప్రేమ్ ఓడిపోయిన చోటనే గెలువు. తిట్టిన వాళ్లతోనే పొగిడించుకో లక్ష్యం దూరం చేసుకునే ప్రయత్నాలు చేయను అని మాట ఇవ్వు ప్రేమ్ అని అతని దగ్గర మాట తీసుకుంటుంది శృతి.
అభి మాటలను చాటుగా విన్న తులసి ఆలోచన పడి కఠిన నిర్ణయమే తీసుకుంటుంది. గాయత్రికి ఫోన్ చేసి నేను మీ ఇంటి నుంచి వేరే వాళ్ల కాల్ కోసం ఎదురు చూస్తుంటే.. నువ్వు ఫోన్ చేయడం ఊహించలేదంటుంది. రేపు ఇంట్లో శ్రీరామనవమి పూజ చేస్తున్నాం.. నీకు ఇష్టమైన గిప్ట్ నువ్వు సంతోషపడేవిధంగా చేస్తాను ఇంటికి రావాలని గాయత్రికి చెబుతుంది తులసి. నీ మాట విని వస్తాను.. కానీ మోసం చేస్తే మాత్రం వదిలిపెట్టేదే లేదంటుంది గాయత్రి. ఇక రేపటి ఎపిసోడ్‌లో తులసి రామారామా అని పాటలు పాడి.. అభిని ముస్తాబు చేస్తుంది. ఒరేయ్ మనవడా మీ అమ్మ నిన్ను శ్రీరాముడిని చేసింది. వనవాసం చేయాలేమో చూసుకో అని పరందామయ్య అనడంతో ఇక రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి :
- సింహాలు ముసలివయ్యక ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాయి.. కారణం ఇదేనా..?
- ఎండ తీవ్రతకు మీ శరీరాన్ని యాక్టివ్‌గా మార్చే ఎనర్జిటిక్ డ్రింక్ ఇదే..!
- కేజీఎఫ్-2 ఇనాయత్ కలీల్ ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ తండ్రి అన్న సంగతి తెలుసా…!