ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కామన్ అయిపోయింది. అందులో కొన్ని వైరల్ అవుతుండగా.. మరికొన్ని నామమాత్రంగా అలాగే ఉంటాయి. ఇక ముఖ్యంగా పెళ్లి గురించి అయితే ఏ వీడియో పెట్టినా అది వైరల్ అవుతుంటుంది. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు.. ఎవరైనా సరే వారి పెళ్లికి సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేయగానే వాటికి చాలా లైకులు వస్తుంటాయి. మామూలుగా పెళ్లి అంటే అందరి ఫోకస్ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుపైనే ఉంటుంది. తాజాగా ఓ వీడియోలో ఉన్నట్టుండి పెళ్లికొడుకు చేసిన వీరంగానికి పెళ్లి కూతురుతో పాటు అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు.
Also Read : విడాకుల తరవాత దారుణమైన పరిస్థితులు…వైరల్ అవుతున్న సమంత కామెంట్స్..!
Advertisement
Advertisement
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అప్లోడ్ చేయగానే వారికి మాత్రం మిలియన్ల వ్యూస్ అయితే వచ్చేశాయి. అందులో అప్పటివరకు మామూలుగా ఉన్న పెళ్లి కొడుకు ఒక్కసారిగా పెళ్లి కూతురును కొట్టడం మొదలుపెట్టాడు. ఇద్దరు వ్యక్తు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారా అనే విషయం వారి మొహం చూస్తేనే చెప్పేయవచ్చు.
ఇలా వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లికొడుకు, పెళ్లికూతురుకు ఒకరంటే మరొకరికీ ఇష్టం లేనట్టుగా కనిపిస్తోంది. అందుకే సరదాగా పెళ్లి కొడుకును పువ్వుతో కొట్టింది పెళ్లి కూతురు. దీనికి ఆ వరుడు ఒక్కసారిగా రెచ్చిపోయి తనను కొట్టడం ప్రారంభించాడు. ఇది చూసిన వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అందులో ఒకరు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది వైరల్ గా మారింది.
Also Read : కేసు నుంచి తప్పించుకోవడానికి చనిపోయినట్టు నటించిన మహిళ.. చివరికీ ఏమైందంటే..?