2022-23 ఏడాది ఎడ్యుకేషన్ ఇయర్ త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలోనే, తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 25 నుండి వేసవి సెలవులను ప్రకటించింది 2022-23 విద్యా సంవత్సరంలో 1 నుండి 9వ తరగతిలో విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది.
Advertisement
తోలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, 10వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 3 నుండి 13 వరకు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో, 1 నుండి 9వ తరగతుల విద్యార్థులకు ఎస్ఏ-2 పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
Advertisement
మార్చి రెండో వారంలో ఒంటి పూట బడులు అలాగే, మార్చి రెండో వారం నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 17 వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 21 ఫలితాలు వెల్లడి, ఏప్రిల్ 24న అన్ని స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది.
READ ALSO : చనిపోయే ముందు నటుడు రంగనాథ్ గోడపై ఏమని రాసారో తెలిస్తే… కన్నీళ్లు ఆగవు!