Home » “గోవిందుడు అందరివాడేలే” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా…? ఏం చేస్తుందంటే..?

“గోవిందుడు అందరివాడేలే” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా…? ఏం చేస్తుందంటే..?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వాళ్లు హీరో హీరోయిన్ లుగా ఎంట్రీస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరికొందరు సినిమాలకు దూరంగా ఇతర కెరీర్ మార్గాలను ఎంచుకున్నారు. మరికొందరు రీఎంట్రికి సిద్ధమవుతున్నారు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ హీరోగా నటించిన గోవిందుడు అందరివాడేలే సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినా మిక్స్ట్ టాక్ ను సొంతం చేసుకుంది.

Advertisement

ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించగా కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ కు జోడిగా నటించింది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కు చెల్లెలి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. సినిమాలో రామ్ చరణ్ ఫ్యామిలీ ఫారెన్ లో సెటిల్ అవ్వడం వల్ల అక్కడి నేటివిటీ కి తగ్గట్టుగా నటించేందుకు చైల్డ్ ఆర్టిస్ట్ అయేషా కుదుస్కర్ ను ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాలో వచ్చిన ఆఫర్ ను ఆయేషా సద్వినియోగం చేసుకుంది.

Advertisement

తన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో ఫారిన్ నుండి వచ్చిన పాష్ అమ్మాయిలా జీవించేసింది. సినిమాలో రామ్ చరణ్ మరియు ఆయేషాల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఆయేషా గోవిందుడు అందరివాడేలే సినిమా కంటే ముందే బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సీరియల్స్ మరియు సినిమాలలో నటించింది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన అగ్నిపత్ సినిమాలోనూ నటించింది.

ఇక ప్రస్తుతం ఆయేషా సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. గోవిందుడు అందరివాడేలే సినిమాలో తన నటనతో అభిమానులను సంపాదించుకున్నప్పట్టికీ ఆ తర్వాత కూడా పెద్దగా ఆఫర్లను అందుకోలేకపోయింది.

అంతేకాకుండా ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పటికి ఇప్పటికీ ఆయేషా చాలా మారిపోయింది. ప్రస్తుతం ఆయేషా లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also read : దగ్గుబాటి వారసుడి హీరో ఎంట్రీ ఎప్పుడో.. నో చెబుతున్న హీరోయిన్లు కారణం శ్రీరెడ్డియేనా..?

Visitors Are Also Reading