తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య గ్యాప్ పెరుగుతూ పోతోంది. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంపై ఇప్పటికే ఘాటుగా స్పందించారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇప్పటికీ మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదన్న ఆమె అత్యున్నత పదవీలో ఉన్న వారికి కూడా సరైన గౌరవం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక నన్ను ఎవ్వరూ భయపెట్టలేదని నేను దేనికీ భయపడను అని కూడా వ్యాఖ్యానించారు.
Advertisement
తమిళనాడు మహిళలకు తెలంగాణ మహిళలకు తేడా ఏమిటని నన్ను ఓ ఇంటర్వ్యలూలో అడిగారు. అందరూ ఒకేవిధంగా ఉంటారు అని చెప్పానని గవర్నర్ తమిళి సై తెలిపారు. తెలంగాణ సోదరిగా నేను ఇక్కడ మహిళల జీవన విధానాన్ని ఎంతగానో ఇష్టపడుతానన్నారు. మహిళలు ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాలి. ఆనందాన్ని దేని కోసం కూడా వదులుకోకూడదన్నారు. అవకాశం చేజారినా బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా సాధించాలన్న తపన ఎప్పుడు ఉండాలని సూచించారు.
Advertisement
Also Read : Video Viral : తన గర్ల్‌ఫ్రెండ్స్ అందరికీ పెళ్లి అయిందంటోన్న సల్మాన్‌ఖాన్