Home » Video Viral : తన గర్ల్‌ఫ్రెండ్స్‌ అందరికీ పెళ్లి అయిందంటోన్న స‌ల్మాన్‌ఖాన్

Video Viral : తన గర్ల్‌ఫ్రెండ్స్‌ అందరికీ పెళ్లి అయిందంటోన్న స‌ల్మాన్‌ఖాన్

by Anji
Ad

బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ అంటే ట‌క్కున గుర్తొచ్చేది స‌ల్మాన్‌ఖాన్‌. అత‌ని పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుంద‌నేది ఒక మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌గా మారింది. స‌ల్మాన్ పెళ్లి పీట‌లు ఎక్కితే చూడాల‌ని ఆయ‌న అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. స‌ల్మాన్‌ఖాన్ గ‌ర్ల్ ఫ్రెండ్స్ వివాహంపై వ‌చ్చే రూమ‌ర్స్, ఫేక్ న్యూస్‌లు సైతం ట్రెండింగ్‌లో ఉంటాయి. దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది. తాజాగా మ‌రొక వ్య‌క్తికి కూడా ఆస‌క్తి ఉంది. అత‌ను ఎవ‌రో స‌ల్మాన్ ఖాన్‌కు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చిన హ‌మ్ ఆప్కే హై కౌన్ సినిమాలోని ప్రేమ్‌. అవును. ఇది విన‌డానికి కాస్త వింత‌గా ఉంది క‌దూ. ఇటీవ‌ల సోష‌ల్ మీడియా వేదికగా స‌ల్మాన్ ఖాన్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తే న‌మ్మ‌కుండా మాన‌రు.

Also Read :  RADHESHYAM : “రాధేశ్యామ్” సెట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా…!

Advertisement

స‌ల్మాన్ ఖాన్ సోమ‌వారం హ‌మ్ ఆప్కే హై కౌన్ చిత్రంలోని ప్రేమ్ పాత్ర‌ను క‌లుసుకున్న వీడియోను షేర్ చేశాడు. అందులో స‌ల్లూభాయ్ త‌న భ‌విష్య‌త్‌లో ఏమి జ‌రిగిందో ప్రేమ్ కు చెబుతున్న‌ట్టుగా ఉంది. ఈ వీడియోలో ప్రేమ్‌.. ప్యూచ‌ర్ నుంచి వ‌చ్చిన స‌ల్మాన్‌ను నువ్వు పెళ్లి చేసుకున్నావా..? అని ఆత్రంగా అడుగుతాడు. అందుకు ప్యూచ‌ర్ స‌ల్మాన్ పెళ్లి అయింది. నీ గ‌ర్ల్ ఫ్రెండ్స్ అంద‌రికీ అని స‌మాధానం ఇస్తాడు. అందుకు ప్రేమ్ నిరాశ చెందుతాడు.

ఇదిలా ఉండ‌గా.. 80వ ద‌శ‌కంలో స‌ల్మాన్‌ఖాన్ న‌టి సంగీత బిజ్లానీతో డేటింగ్ చేశాడు. త‌రువాత సోమీ అలీ, ఐశ్వ‌ర్యరాయ్, క‌త్రీనా కైఫ్‌ల‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం స‌ల్మాన్‌ఖాన్ క‌త్రీనా కైఫ్ జోడీగా అల‌రించేందుకు టైగ‌ర్‌-3 సినిమాతో రెడీగా ఉన్నారు. ఈ స్పై థ్రిల్ల‌ర్ మూవీ ఏప్రిల్ 21, 2023న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ముందుకు రానున్న‌ది.

Visitors Are Also Reading