Home » పెళ్లి పీటలు ఎక్క‌బోతున్న “గోరింటాకు” సీరియ‌ల్ జోడీ…వీళ్ల ప్రేమ‌క‌థ‌లో ఎన్ని ట్విస్టులో..!

పెళ్లి పీటలు ఎక్క‌బోతున్న “గోరింటాకు” సీరియ‌ల్ జోడీ…వీళ్ల ప్రేమ‌క‌థ‌లో ఎన్ని ట్విస్టులో..!

by AJAY

ఎన్ని కోట్ల బ‌డ్జెట్ తో సినిమాలు వ‌చ్చినా సీరియ‌ల్స్ కు మాత్రం ప్రేక్ష‌క‌ల‌లో ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. మ‌హిళ‌లు ఎక్కువ‌గా సీరియ‌ల్స్ ను ఇష్ట‌ప‌డుతుంటారు. ఉద‌యం లేచిన‌ప్ప‌టి నుండి రాత్రి ప‌డుకునేవ‌ర‌కూ కొన్ని చాన‌ల్స్ లో సీరియ‌ల్స్ ప్ర‌సారం అవుతునే ఉంటాయి. ఎలాంటి ప‌రిస్థితిలో ఉన్న ఎంత బిజీగా సీరియ‌ల్స్ ను మిస్ కాకుండా చూస్తారు. ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ ల హ‌వా న‌డుస్తున్నా కూడా సీరియ‌ల్స్ క్రేజ్ ఏ మాత్రం తగ్గ‌లేదంటే అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక సీరియల్స్ ను కూడా ప్ర‌స్తుతం ఎక్క‌వ బ‌డ్జెట్ తో టెక్నిక‌ల్ వ్యాల్యూస్ తో క‌ల‌ర్ ఫుల్ గా నిర్మిస్తున్నారు. అంతే కాకుండా కేవ‌లం తెలుగు వాళ్ల‌నే కాకుండా త‌మిళ‌, మ‌ల‌యాళ హిందీ న‌టీన‌టులు కూడా తెలుగు సీరియ‌ల్స్ న‌టించ‌డానికి ఇష్ట‌ప‌డున్నారు. అంతే కాకుండా సీరియ‌ల్ హీరోలు హీరోయిన్ లకు చాలా మంది అభిమానులు ఉంటున్నారు. ఒక చిన్న సినిమా హీరో కంటే సూప‌ర్ హిట్ సీరియ‌ల్ హీరోకు హీరోయిన్ ల‌కు ఎక్కువ మంది అభిమానులు ఉంటార‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు.

ఇక సినిమా హీరోలు హీరోయిన్ లు ప్రేమించి తమ కో స్టార్స్ ను పెళ్లి చేసుకున్న‌ట్టు సీరియ‌ల్స్ హీరోహీరోయిన్ లు కూడా ప్రేమ‌వివాహాలు చేసుకుంటున్నారు. ఇటీవ‌లే సీరియ‌ల్ హీరో హీరోయిన్ లు అమ‌ర్ దీప్, తేజ‌స్విలు ప్రేమించుకుని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కాగా ఇప్పుడు గోరింటాకు సీరియ‌ల్ హీరోహీరోయిన్ లు నిఖిల్ కావ్యశ్రీ కూడా ప్రేమ‌లో ఉన్నారు.

మా టీవీలో సూప‌ర్ హిట్ అయ్యిన గోరింటాకు సీరియ‌ల్ లో హీరోహీరోయిన్ లుగా న‌టించి వీరి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. సీరియ‌ల్ లో చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపించిన ఈ జంట బ‌య‌ట కూడా చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపిస్తున్నారు. రీసెంట్ గా ఓఇంట‌ర్వ్యూలో తాము చాలా గొడ‌వ ప‌డ‌తామ‌ని మ‌ళ్లీ వెంటనే క‌లిసిపోతామ‌ని చెప్పారు. ఒక‌రికొక‌రు ప్ర‌పోజ్ చేసుకున్నారు. త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లి పీట‌లు ఎక్క‌బోతోంద‌ట‌.

Visitors Are Also Reading