Home » థియేటర్‌లో డిజాస్టర్‌.. ఓటీటీలో సూపర్‌ హిట్‌ సాధించిన గోపిచంద్ మూవీ..!

థియేటర్‌లో డిజాస్టర్‌.. ఓటీటీలో సూపర్‌ హిట్‌ సాధించిన గోపిచంద్ మూవీ..!

by Anji
Ad

కరోనా మహమ్మారి తరువాత ఓటీటీకి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పటికీ ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఓటీటీ చూడటానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా చూసే విధానం మొత్తం  మారిపోయింది. పెద్ద పెద్ద స్క్రీన్స్ తో కూడిన టీవీలు అందుబాటులోకి రావడం..  మంచి క్వాలిటీతో కూడిన సౌండ్ సిస్టమ్ లు అందుబాటులోకి రావడంతో జనాలు థియేటర్లకు బదులు ఓటీటీలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.  సినిమాలు చూడడం చాలా  ఎక్కువవుతోంది. దీంతో మూవీ మేకర్స్ సైతం భారీ మొత్తానికి ఓటీటీ హక్కులను కొనుగోలు చేస్తున్నారు.  

Advertisement

ఈ క్రమంలోనే థియేటర్లలో పెద్దగా ఆడని చిత్రాలు సైతం ఓటీటీలో  మంచి సందడి చేస్తున్నాయి. ప్రేక్షకాదరణతో దూసుకుపోతున్నాయి. తాజాగా థియేటర్లలో డిజాస్టర్ అయిన ఓ సినిమా ఓటీటీ లో మాత్రం దుమ్ము రేపుతోంది. ఇంతకీ ఆ సినిమా ఎంటనేగా మీ సందేహం. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన రామబాణం సినిమానే. థియేటర్లలో భారీ డిజాస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. కానీ  తాజాగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా రికార్డు వ్యూస్ తో సంచలనం సృష్టించింది. ఏకంగా టాప్-1  ట్రెండింగ్ లో నిలవడం విశేషం. ఈ సినిమా విడుదలైన దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది.

Advertisement

సెప్టెంబర్ 14వ తేదీ నుంచి నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడు ఏకంగా టాప్ వన్ ట్రెండింగ్ లో నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోని ఈ సినిమా ఓటీటీలో మాత్రం ఊహించని రెస్పాన్స్ అందుకుంటుంది. పీపుల్స్  మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టి. విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని సుమారు రూ.55 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. రొటీన్ కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఓటీటీ విడుదలను కూడా వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా 4 నెలల తర్వాత నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ వారం నెట్ ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్ లో రామబాణం మొదటి స్థానంలో నిలవడం విశేషం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పుష్ప 2 లో తమిళ స్టార్ హీరో.. ప్లాన్ మామూలుగా లేదుగా..!

ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్ననటులు వీరే..!

Visitors Are Also Reading