ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పుష్ప 2. ఈ చిత్రం పై రోజు రోజుకు అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇటీవలే పుష్ప 2 మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపిన మూవీ టీమ్ అంతలోనే మరో బిగ్ సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది.
Advertisement
పుష్ప సినిమా మొదటి పార్ట్ 2022 డిసెంబర్ లో విడుదలై దేశవ్యాప్తంగా మంచి పాపులర్ అవ్వడంతో పుష్ప సినిమా సెకండ్ పార్ట్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో డైరెక్టర్ సుకుమార్ ప్రేక్షకుల్లో పెరిగిన ఈ అంచనాలన్నింటినీ మైండ్ లోకి పెట్టుకొని అన్ని భాషల ప్రేక్షకులను అలరించడానికి గాను పుష్ప సినిమాలో పలు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా పలువురు హీరోలను, ఆర్టిస్ట్ లను తీసుకోనున్నారట. ఇక లేటెస్ట్ గా వస్తున్న రూమర్స్ ప్రకారం చూస్తే.. తమిళ్ స్టార్ హీరో కార్తీ ని పుష్ప సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటించడానికి మేకర్స్ చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది.
Ad
Advertisement
ఇప్పటికే మలయాళం స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ పుష్ప నటిస్తుండటంతో తమిళ్ ఆడియన్స్ ను కూడా పుష్పలో ఇంక్లూడ్ చేయడానికి గాను సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే గనుక వాస్తవం అయితే పుష్ప రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. తమిళ హీరో కార్తీ కనుక పుష్ప మూవీలో నటిస్తే సినిమా రేంజ్ మరింత పెరిగిపోతుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు పుష్ప 2 మూవీలో ఐటమ్ సాంగ్ కోసం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ మూవీ విడుదలయ్యే వరకు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Pushpa 2 : అల్లు అర్జున్.. పింక్ గోరు వెనక గల మిస్టరీ ఏంటి…?