Home » Google pay loan: గూగుల్ పే వాడుతున్నారా..8 లక్షలు మీ సొంతం..ఎలాగంటే..?

Google pay loan: గూగుల్ పే వాడుతున్నారా..8 లక్షలు మీ సొంతం..ఎలాగంటే..?

by Sravanthi
Ad

చాలామంది లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారు. బ్యాంకు లోన్ ఇవ్వడానికి అనేక కండిషన్లు పెడుతుంది. అవన్నీ క్లియర్ అయ్యే సరికి చాలా సమయం పడుతుంది. కానీ గూగుల్ పే ద్వారా క్షణాల్లో లోన్ పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా.. లోన్ కోసం తిరుగుతున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్ .. క్షణాల్లో లోన్ తీసుకునే సౌకర్యం, బ్యాంకుకు వెళ్లాల్సిన పని కూడా లేదు. గూగుల్ పే ద్వారా లోన్ అప్లై చేసుకోవచ్చు. గూగుల్ పే యాప్ లోకి వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్ ద్వారా లోన్ అప్లై చేసుకోవచ్చు.

Advertisement

also read;సివిల్స్ క్లియర్ చేసిన టీమిండియా క్రికెటర్ గురించి మీకు తెలుసా ?

Advertisement

ఇక్కడ గూగుల్ పేకు మరియు రుణాలకు ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం మీడియేటర్ గా మాత్రమే పనిచేస్తుందనేది సత్యం. లోన్ కావాలనుకునే వారు గూగుల్ పే యాప్ లోకి వెళ్లి, అందులో మెసేజ్ మనీ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో క్రెడిట్ కార్డు, గోల్డ్,లోన్స్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో లోన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో లోన్ ఆఫర్లపై క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న ఆఫర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మీకు నచ్చినటువంటి దాన్ని ఎంచుకోవాలి.

డిఎంఐ ఫైనాన్స్ లోన్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇందులో స్మార్ట్ లోన్ అని అప్లికేషన్ పై క్లిక్ చేసి అడిగిన వివరాలు పొందుపరచాలి. మీకు అర్హత ఉంటే మాత్రం లోన్ లభిస్తుంది.. లేదంటే కట్ అయిపోతుంది. ఇందులో ముఖ్యంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ రుణాలపై వడ్డీ రేటు 15% నుంచి ప్రారంభమవుతుంది. పదివేల రూపాయల నుంచి 8 లక్షల వరకు లోన్ పొందవచ్చు. మీకున్న అర్హతను బట్టి లోన్ శాంక్షన్ చేయబడుతుంది.

also read;కొత్త ఏడాదిలో ఈ 3 రాశుల వారికి గజలక్ష్మి రాజయోగమే..?

Visitors Are Also Reading