Home » యూట్యూబ్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా అందుబాటులోకి మరో యాప్..!

యూట్యూబ్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా అందుబాటులోకి మరో యాప్..!

by Anji
Published: Last Updated on
Ad

గూగుల్ యజమాన్యంలోని ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ వీడియో క్రియేటర్లకు శుభవార్త చెప్పింది. తాజాగా యూట్యూబ్ క్రియేట్ యాప్ లాంచ్ చేసింది. ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్ క్రియేటర్లు వీడియోలను సులువుగా రూపొందించుకునేవిధంగా కొత్త యాప్ ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.  ఈ విషయాన్ని గూగుల్ మాతృ  సంస్థ అల్పాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఎక్స్ ప్రకటించింది. ఏఐ పవర్డ్ టెక్నాలజీ రంగంలో తన మార్గ-బ్రేకింగ్ ఆవిష్కరణను వెల్లడించింది గూగుల్.

Advertisement

వీడియో క్రియేట్ లో ప్రెసిషన్, ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటోమేటిక్, వాయిస్ ఓవర్, క్యాప్షనింగ్, ట్రాన్సిషన్ వంటి ఫీచర్లు ఉంటాయని కంపెనీ బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది. చాట్ బాక్స్ లో మనం అనుకున్నది టైప్ చేయడం ద్వారా రి వీడియోలకు ఏఐ రూపొందించిన వీడియో లేదా చిత్రాన్ని జోడించేలా డ్రీమ్ స్క్రీన్ అనే కొత్త ఫీచర్ ను టెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఉదాహరణకు వినియోగదారులు నేను ఫారెస్ట్ లో ఉండాలనుకుంటున్నాను అని టైప్ చేస్తే దానికి సంబంధించిన వీడియో లేదా ఫొటో వస్తుంది. ట్రెండింగ్ టాపిక్, ప్రేక్షకుల ప్రాధాన్యత ఆధారంగా వీడియోల కోసం టాపిక్ ఐడియాలు, అవుట్ లైన్ లను రూపొందించడంలో సహాయపడుతుంది.

Advertisement

ఈ కొత్త యాప్ ప్రతీ ఒక్కరికీ వీడియో ప్రొడక్షన్ ను సులభతరంగా చేయడం.. ప్రధానంగా ఫస్ట్ టైమ్ యూట్యూబ్ వీడియోలు చేస్తున్న వారికి మరింత అందుబాటులో ఉండేవిధంగా చేయడమే తమ లక్ష్యం అని యూట్యూబ్ కమ్యూనిటి ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ టోని తెలిపారు. ఈ ఫీచర్ షార్ట్ ఫారమ్ వీడియోల కోసం మాత్రమే కాకుండా.. యూట్యూబ్ లో లాంగ్ ఫామ్ కంటెంట్ కి కూడా సమానంగా సపోర్ట్ చేస్తుందని వెల్లడించారు. తద్వారా చిన్న వీడియోలు లేదా రీల్స్ విషయంలో యూత్ మనస్సు దోచుకున్న టిక్ టాక్, ఇన్ లోని యాప్ లతో యూట్యూబ్ క్రియేట్ పోటీ పడనుంది. ప్రస్తుతానికి ఇది ఎంపిక చేసిన దేశాల్లో యాప్ ఆండ్రాయిడ్ బీటా మోడ్ లో తొలుత భారత్ అమెరికా, యూకె, జర్మనీ, ఫ్రాన్స్, ఇండోనోషియా, సింగపూర్, కొరియాలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Bigg Boss 7 : కన్నీరు పెట్టుకున్న ప్రశాంత్ తండ్రి.. రైతు అని చులకన చేస్తున్నారంటూ..?

ప్రధాని మోడీ చాలా ఇష్టంగా తినే ఈ పరోటాతో మధుమేహం, రక్తపోటు మటుమాయం..!

Visitors Are Also Reading