Home » వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. మరో 4 కొత్త ఫీచర్స్ ..!

వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. మరో 4 కొత్త ఫీచర్స్ ..!

by Anji
Ad

వాట్సాప్ తమ యూజర్లకు కొత్త ఫీచర్స్ ని విడుదల చేస్తుంది. గత వారమే 5 కొత్త ఫీచర్స్ విడుదల చేసిన విషయం విధితమే. ఇప్పుడు మరో 4 ఫీచర్స్ విడుదల చేసింది. వారం కిందట ప్రైవేట్ ఆడియెన్స్ సెలెక్టర్, వాయిస్ స్టేటస్, స్టేటస్ రియాక్షన్, స్టేటస్ ప్రొఫైల్, లింక్ ప్రివ్యూస్ ఫీవ్యూస్ ఫీచర్స్ ని రిలీజ్ చేసింది వాట్సాప్. ఇప్పుడు డాక్యుమెంట్ క్యాప్షన్, గ్రూపు డిస్క్రిప్షన్, పర్సనలైజ్ అవతార్ మీడియాకి షేరింగ్ కి సంబంధించిన 4 ఫీచర్స్ తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్ యూజర్లు లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ డౌన్ లోడ్ చేసుకొని ఈ ఫీచర్స్ వాడుకోవచ్చు.  ఈ ఫీచర్స్ ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. 

Advertisement

వాట్సాప్ లో డాక్యుమెంట్ షేర్ చేసేటప్పుడు క్యాప్షన్ యాడ్ చేయవచ్చు. డాక్యుమెంట్ సెలెక్ట్ చేయగానే క్యాప్షన్ బార్ కనిపిస్తోంది. క్యాప్షన్ తో డాక్యుమెంట్ పంపిస్తే.. తరువాత ఎప్పుడైనా వెతకడానికి సులువు అవుతుంది. ప్రస్తుతం గ్రూప్ గురించి వివరించేందుకు 512 క్యారెక్టర్ల లిమిట్ ఉంది. ఈ లిమిట్ ని 2048 క్యారెక్టర్లకు పెంచేసింది వాట్సాప్. గ్రూపు సబ్జెక్ట్, డిస్క్రిప్షన్ ని 2048 క్యారెక్టర్ల వరకు వివరించవచ్చు. గతంలో వాట్సాప్ లో ఫోటోలను పంపడానికి 30 వరకే లిమిట్ గా ఉండేది. అనగా ఒకసారి కేవలం 30 ఫోటోలను మాత్రమే సెలెక్ట్ చేసి పంపవచ్చు. ఈ లిమిట్ ని 100కి పెంచేసింది. ఒకేసారి 100 ఫోటోలు, వీడియోలు షేర్ చేయవచ్చు. 

Advertisement

Also Read :   భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడవ‌ల‌కు 4 కార‌ణాలు ఇవేన‌ట‌..? ఎలా ప‌రిష్క‌రించుకోవాలంటే..!

వాట్సాప్ లో ప్రొపైల్ ఫోటో బదులు పర్సనలైజ్డ్ అవతార్ క్రియేట్ చేసి పెటవచ్చు. ఈ ఫీచర్ కొంతకాలం కిందటే విడుదల అయింది. వాట్సాప్ 2.22.24.73 ఆండ్రాయిడ్ వర్షన్ అప్ డేట్ చేసిన వారికి ఈ ఫీచర్ లభిస్తుంది. వాట్సాప్ ఇటీవల 5 కొత్త ఫీచర్స్ ని విడుదల చేసింది. మీరు షేర్ చేసే స్టేటస్ కోసం ప్రైవసీ సెట్టింగ్స్ లో కొన్ని మార్పులు చేసింది వాట్సాప్. మీరు అప్ డేట్ చేసే స్టేటస్ ఎవ్వరూ చూడాలో మీరే నిర్ణయించే అవకాశముంటుంది. వాట్సాప్ స్టేటస్ లో ఫోటోలు, వీడియోలు, లింక్స్ మాత్రమే కాదు. ఇకపై వాట్సాప్ స్టేటస్ లో 30 సెకండ్ల ఆడియో కూడా అప్ డేట్ చేయవచ్చు. 

Also Read :   మీ పిల్లల ముందు ఈ పనులు అస్సలు చేయకండి..!

Visitors Are Also Reading