టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త చెప్పింది పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ . కోహ్లీ 100 టెస్ట్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ప్రేక్షకులను అనుమతించాలని కోరడంతో పీసీఏ అనుమతి ఇచ్చింది. 50 శాతం మంది కెపాసిటీతో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించనున్నారు. భారత్, శ్రీలంక ద్వైపాక్షిసిరీస్‌లో భాగంగా ఈనెల 04 నుంచి మొహలీ వేదికగా తొలిటెస్ట్ జరుగనుంది. ఈ టెస్ట్‌తో విరాట్ కోహ్లీ తన 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు.
Also Read : నిరీక్షణ హీరోయిన్ అర్చన ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..!
Advertisement
Advertisement
టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడటం ఏంటే ఎంతో ప్రత్యేకం. దిగ్గజ ప్లేయర్లకు సైతం టెస్టుల్లో 100 మ్యాచ్ ఆడటం సాధ్యం అయ్యే పని కాదు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌కు ఎలాంటి ఆంక్షలు ఉండవు అని, ప్రభుత్వం నిబంధనల మేరకు ప్రేక్షకులను అనుమతిస్తున్నారని బీసీసీఐ చీఫ్ గంగూలీ చెప్పారు. భారత్, శ్రీలంక తొలిటెస్ట్ తలుపులు మూసి జరుగదని ప్రస్తుతం పరిస్థితులు వివిధ అంశాల ఆధారంగా ప్రేక్షకులను అనుమతిస్తారని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా అన్నారు.
ప్రస్తుతం కోహ్లీ 100 టెస్ట్‌కు అనుమతి ఇస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతకు ముందు కరోనా కారణంగా స్టేడియంలోకి ఎవరినీ అనుమతించం అని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. దీంతో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. బీసీసీఐ పై కోహ్లీ అభిమానులు మండిపడ్డారు.
Also Read : ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌కు ఎదురు దెబ్బ.. ఆ ఆటగాడికి కరోనా..!