Home » నిరీక్ష‌ణ హీరోయిన్ అర్చ‌న ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..!

నిరీక్ష‌ణ హీరోయిన్ అర్చ‌న ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..!

by AJAY
Ad

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ లుగా రానించిన చాలా మంది సీనియ‌ర్ హీరోయిన్ లు ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీకి దూర‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే అలా దూర‌మైన సీనియ‌ర్ హీరోయిన్లు ఒక్కొక్క‌రుగా మ‌ళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ అర్చ‌న కూడా రీఎంట్రీకి సిద్ద‌మ‌వుతోంది. అర్చ‌న లేడీస్ టైల‌ర్, నిరీక్ష‌ణ లాంటి సినిమాల‌తో ప్రేక్ష‌కుల మ‌దిని దోచింది.

Advertisement

అర్చన త‌న గ్లామ‌ర్ కంటే న‌ట‌న అభిన‌యంతోనే ఎంతో మంది అభిమానులును సంపాదించుకుంది. త‌న న‌ట‌న‌తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది.

Advertisement

ఇక ఇప్పుడు అర్చ‌న పూరీజ‌గ‌న్నాత్ త‌న‌యుడు ఆకాష్ పూరీ హీరోగా న‌టిస్తున్న చోర్ బ‌జార్ అనే సినిమాతో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమాకు జార్జిరెడ్డి సినిమా ద‌ర్శ‌కుడు జీవ‌న్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాష్ పూరీకి జోడీగా గెహ‌నా సిప్పీ హీరోయిన్ గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

కాగా ఈ సినిమాలోనే అర్చ‌న కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే టాలీవుడ్ లో సీనియ‌ర్ హీరోయిన్ ల సంద‌డి మొద‌లైన సంగ‌తి తెలిసిందే. న‌దియా లాంటి న‌టీమ‌ణులు రీఎంట్రీ ఇచ్చి వ‌రుస సినిమాల‌తో బిజీగా మారారు. మ‌రి అర్చ‌న కెరీర్ రీఎంట్రీ త‌ర‌వాత ఎలా ఉంటుందో చూడాలి.

Visitors Are Also Reading