Home » నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు..!

by Anji
Ad

నిరుద్యోగులకు ప్రభుత్వ రంగ బ్యాంకు అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ శుభవార్త చెప్పింది. ఎస్ బీఐ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన విషయం విధితమే. ఈ నోటిఫికేషన్ లో ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికనే ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అయితే ఈ నోటిఫికేషన్ లో మొత్తం రెండు కేటగిరీలున్నాయి. రిటైల్ ప్రొడక్ట్స్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అనే రెండు పోస్టులున్నాయి. ఔత్సాహికులు ఈ పోస్టుల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. 

Also Read :   Kabzaa Trailer : కబ్జా ట్రైలర్ రిలీజ్… కేజిఎఫ్ మూవీని మించిపోయిందిగా…!

Advertisement

Manam News

మార్చి 15 వరకు ఆన్ లైన్ లో మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.750 దరఖాస్తు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు ఈ పోస్టుల విద్యార్హతల విషయానికొస్తే.. రిటైల్ ప్రొడక్ట్స్ మేనేజర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఎంబీఏ మార్కెటింగ్, మార్కెటింగ్ లో పీజీడీఎం లేదా పీజీపీఎం చేసి ఉండాలి. ఎడ్యుకేషన్ తో పాటు కొంచెం ఎక్స్ పీరియన్స్ కూడా ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఏదైనా స్పెషలైజేషన్ తో పీజీ డిగ్రీ, ఎక్స్ పీరియన్స్ ఉండాలి. అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 31, 2022 నాటికి 28 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. 

Advertisement

Also Read :  నల్ల మిరియాలతో బరువు తగ్గవచ్చనే విషయం మీకు తెలుసా ? 

Manam News

రిజర్వేషన్ అభ్యర్థులకు వయస్సులో కాస్త సడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులందరిలో షార్ట్ లిస్ట్, ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఎవరైతే ఈ పోస్టులకు ఎంపిక అవుతారో వారు కలకత్తాలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. రీటైల్ మేనేజర్ పోస్టులు మొత్తం 5 ఖాళీలున్నాయి. వీటికి అప్లై చేసుకునే వారు 28 నుంచి 38 మధ్య వయస్సు వారై ఉండాలి. వీరికి సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ లో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు 28 నుంచి 55 మధ్య వయస్సు కలిగిన వారు అయి ఉండాలి. వీరికి సంబంధిత రంగంలో మూడేళ్ల కనీస అనుభవం ఉండాలనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.  

Also Read :  వివాహితులకు ఒడిబియ్యం పోయడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా ?

Visitors Are Also Reading